Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పిన్ని ఊరికెళ్లింది... నిద్ర రావడం లేదు... ఇంటికి వస్తావా....

Advertiesment
victim

ఠాగూర్

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (09:14 IST)
మీ పిన్ని ఊరికివెళ్లింది. నాకు నిద్ర రావడం లేదు.. నీవు ఇంటికి వస్తావా అంటూ అర్థరాత్రి ఓ యువతికి వైకాపా నేత మెసేజ్ పెట్టి వేధించాడు. పైగా, తన అర్థనగ్న ఫోటోలను పంపించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జిల్లాలోని పెనుకొండ మండలం మునిపుడుగు పంచాయతీ ఉప సర్పంచ్, వైసీపీ నాయకుడు వెంకటరెడ్డి ఓ యువతికి అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పంపించాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కియ పోలీసులు వెంకటరెడ్డిపై మంగళవారం కేసు నమోదు చేశారు. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడు పరారయ్యాడు. 
 
మునిపుడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని అమ్మవారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఇటీవల పరిచయం పెంచుకున్నాడు. వేరే ప్రాంతంలో చదువుతూ, పండుగకు ఊరికి వచ్చిన సమయంలో పలకరించి, ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అది మొదలు అర్ధరాత్రి. తెల్లవారుజామున యువతికి మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. 
 
ఆ యువతి 'బాబాయ్..' అని స్పందించినా... 'మీ పిన్ని ఊరికి వెళ్లింది. నిద్ర రావడం లేదు" అంటూ అర్థనగ్నంగా, ఆశ్లీలంగా ఉన్న తన ఫొటోలను పంపించాడు. వేధింపులు కొనసాగడంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు పెనుకొండ సీఐ రాఘవన్ను కలిశారు. 
 
అనంతరం సీఐ సూచనల మేరకు కియ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అనుచరుడు. గతంలోనూ గ్రామానికి చెందిన యువతులను ఇదే తరహాలో వేధించాడు. ఇప్పటికే అతనిపై రెండు కేసులు ఉన్నాయని, రిమాండ్‌కు కూడా వెళ్లి వచ్చాడని పెనుకొండ పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో వాట్సాప్ రెండవ వ్యాపార సదస్సు: నూతన ఫీచర్లను ప్రదర్శిస్తుంది