Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పేరుతో అసభ్య ప్రవర్తన..

Advertiesment
crime

ఠాగూర్

, బుధవారం, 28 ఆగస్టు 2024 (13:23 IST)
ఇటీవలికాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో బాలికలకు పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెపంతో ఓ బాలికపై 67 యేళ్ల వృద్ధుడు ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. 
 
పూణెలోని ఓ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ బాధ్యతలను 67 యేళ్ల వృద్ధుడికి అప్పగించారు. ఈ వృద్ధుడు విద్యార్థినులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో 11 యేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
అలాగే, మరికొందరు బాలికల తల్లిదండ్రులు సైత్యం ఆ వృద్ధుడుపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలి.. అందుకే కవితకు బెయిల్ ఇస్తున్నాం : సుప్రీంకోర్టు