Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజుకి 10 లక్షలతో పార్టీ చూసి వుంటారు, కానీ రూ. 5 కోట్లతో పార్టీ చూసారా? అదే శిల్పా చౌదరి కిట్టి పార్టీ

Advertiesment
Police
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (15:27 IST)
శిల్పా చౌదరి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. లక్షలు కాదు కోట్లకు కోట్లు చేతులు మార్చి కిట్టి పార్టీలతో ఎంజాయ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోందట.


ఏదో పది లక్షల రూపాయలతో పార్టీ అంటేనే అమ్మో అంటారు, కానీ ఏకంగా ఒక రోజుకి రూ. 5 కోట్లతో కిట్టి పార్టీ అంటే... అది ఏ స్థాయిలో వుంటుందో ఊహించడమే కష్టం అంటున్నారు. ఈ కిట్టి పార్టీలో కేవలం ఎంజాయ్ చేయడమేనా ఇంకా లోతుగా ఏమయినా జరిగేవా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

 
ప్రస్తుతానికి రాధికా రెడ్డికి తను డబ్బులు ఇచ్చాననీ శిల్ప అంటుంటే ఆమె తనకి ఇవ్వలేదని అంటోంది రాధిక. తనకు ఇవ్వాల్సిన డబ్బే ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిందని చెపుతోంది రాధిక. ఐతే నెలకి రూ. 5 లక్షల చొప్పున అధిక వడ్డీ కట్టినట్లు శిల్ప చౌదరి పోలీసులకు చెప్పిందట. కానీ శిల్ప చెప్పేవన్నీ అబద్ధాలని రాధిక అంటుండటంతో రాధికను-శిల్పను ఎదురెదురుగా కూర్చోబెట్టి కూపీ లాగాని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 
మరోవైపు శిల్ప ఓ ఎన్నారైకి కోట్లలో డబ్బులు పంపేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఎన్నారై ఎవరన్న కోణంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద శిల్ప చౌదరి కిట్టి పార్టీల వెనుక చాలా చరత్ర వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలికి వచ్చే అవకాశం వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలుక కరిచినా కరోనా సోకుతుంది-చెన్ షీ చుంగ్