Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మభ్యపెట్టి శారీరకంగా వాడుకున్నాడు.. బాలిక శీలానికి రూ.5 లక్షలు వెలకట్టిన పెద్దలు!

Advertiesment
victimboy

ఠాగూర్

, మంగళవారం, 28 జనవరి 2025 (16:10 IST)
మాయమాటలతో ప్రేమ ముగ్గులోకి దించి, పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకోవడంతో ఆ బాలిక గర్భందాల్చింది. తీరా పెళ్లిమాటెత్తగానే ఆ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాలికను మోసం చేసినట్లు నిర్ధారించే సాక్ష్యాలు బలంగా ఉండడంతో శిక్ష తప్పదని భావించిన యువకుడు కొత్త ఎత్తు వేశాడు. పెద్దమనుషులను రంగంలోకి దించి రూ.5 లక్షలతో కేసు నుంచి బయటపడే ప్రయత్నంచేశాడు.
 
పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన ఓ బాలికను ఆరేళ్ల క్రితం చిప్పలపల్లి గ్రామానికి చెందిన వెంకన్న అనే యువకుడు ప్రేమించానని, పెళ్లిచేసుకుంటానని చెప్పి నమ్మించాడు. మాయమాటలతో మభ్యపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చగా.. వెంకన్న మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు.
 
దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ వెంకన్నపై బాలిక కట్టంగూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి వెంకన్నను కోర్టులో హాజరుపరిచారు. డీఎన్ఏ పరీక్షల్లోనూ బాలిక గర్భానికి కారణం వెంకన్నేనని తేలింది. 
 
దీంతో ఈ కేసులో శిక్ష తప్పదని భావించిన వెంకన్న పెద్దమనుషులతో రాజీకి ప్రయత్నించాడు. పెద్ద మనుషులు బాలిక శీలానికి ఖరీదు కడుతూ.. రూ.5 లక్షలు ఇవ్వాలని తీర్మానించారు. ఇందులో రూ.3.50 లక్షలు పెద్ద మనుషుల పేరుమీద బ్యాంకులో జమ చేసి, మిగతా రూ.1.50 లక్షలు కేసు ముగిసిన వెంటనే ఇచ్చేలా వెంకన్న డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్