Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు
, శనివారం, 28 ఆగస్టు 2021 (16:23 IST)
మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూరుకి చెందిన రోజుకూలీలుగా తేలింది. పొట్ట చేతబట్టుకుని కూలి కోసం వచ్చిన వీరు కామాంధులయ్యారు. శనివారం నాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర డిజిపి తెలిపారు.
 
ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ తమిళనాడు తిరుప్పూరు జిల్లాకు చెందినవారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఒకరు మైనర్ అనీ, మరొకడు పరారీలో వున్నట్లు తెలియజేసారు.
 
కాగా ఆగస్టు 24న మైసూరు శివారు ప్రాంతానికి ఎంబీఎ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరినీ అటకాయించిన కామాంధులు యువకుడిపై దాడి చేసారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు షాక్ లో వుండటంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించలేపోతున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంక‌న్న స‌న్నిధిలో 30న గోకులాష్టమి, 31న ఉట్లోత్సవం