హైదరాబాద్ నగరంలో వ్యభిచార వృత్తి జోరుగానే సాగుతోంది. ఈ వ్యభిచార ముఠాలను పోలీసులు క్రమంగా గుట్టు రట్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో పేరుగాంచి బంజారా హిల్స్ రోడ్ నంబరు 1లోని ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరిట అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. పక్కాసమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురు అమ్మాయిలను రక్షించి, పలువురు విటులను అరెస్టు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ స్పాపై దాడులు చేపట్టి నిర్వాహకులతో సహా 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో 10 మంది మహిళలు కాగా, 10 మంది పురుషులు ఉన్నారు. వీరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.