భార్యపై అనుమానమా? క్షుద్రపూజలు చేశాడా? భార్యను బండరాళ్లతో కొట్టి హత్య
, సోమవారం, 7 జులై 2025 (09:45 IST)
కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధం అనే మాట కనుమరుగవుతుంది. ఎందుకంటే.. అక్రమ సంబంధాల కారణంగా భార్యలు భర్తలను హత్య చేయడం, భార్యలపై అనుమానంతో భర్తలు హత్య చేయడం వంటివి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ భర్త తన భార్య మీద అనుమానంతో పూజలు పేరుతో అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. తలమడుగు మండలం లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. సుందరయ్య నగర్ కాలనీలో ఉంటున్న ఇంగోలి వందన (40) అనే మహిళ మీద అనుమానంతో తన భర్త శంకర్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యకు ఆరోగ్యం బాగోలేదని.. పూజలు చేస్తే ఆరోగ్యం బాగైపోతుందని భార్యను నమ్మించి అడవికి తీసుకెళ్లాడు.
జులై 2వ తేదీన లక్ష్మీ పూర్ చెక్‌పోస్టు దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. భార్యను నమ్మించడానికి అక్కడ కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ వంటి వాటితో పూజలు నిర్వహించారు. ఆ పై భార్యను తలపై బండ రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చేశాడు.
అయితే తల్లి కనిపించకపోయే సరికి తండ్రి మీద అనుమానంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా తన భార్యను చింపేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
తర్వాతి కథనం