Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో భార్యను చూసి కుప్పకూలిన భర్త, కాళ్లపై పడి భార్య కన్నీటి పర్యంతం

Advertiesment
Husband collapses after seeing wife with boyfriend

ఐవీఆర్

, గురువారం, 11 సెప్టెంబరు 2025 (14:09 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్తను కాదని వేరొకరి మోజులో పడి కొంతమంది వివాహితలు అక్రమ సంబంధాలు సాగించడం సాధారణమైపోయింది. ఇలాంటి ఘటన తాలూకు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పనిపై ఊరికి వెళ్లిన భర్త, తను చేయాల్సింది త్వరగా అయిపోవడంతో ఇంటిముఖం పట్టాడు. ఐతే దారిలో తన భార్యకు ఇష్టమైన పదార్థాలను కొనేందుకు ఆమె తరచూ వచ్చే షాపు వద్దకు వెళ్లాడు.

అంతే... ఆ షాపులో తన భార్య ఆమె ప్రియుడితో సరస సల్లాపాలు ఆడుతూ కనిపించింది. అది చూసి షాక్ తిన్న అతడు అక్కడే కూలబడ్డాడు. షాపులోని వ్యక్తులు వచ్చి అతడి ముఖంపై నీళ్లు పోసారు. తన భర్తను చూసిన భార్య అతడి కాళ్లపై పడి లబోదిబోమంటూ తనను క్షమించాలంటూ కన్నీటిపర్యంతమైంది. ఐతే భర్త మాత్రం తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుని వెక్కివెక్కి ఏడ్వడం అక్కడున్నవారిని కలిచివేసింది.
 
ప్రియుడి కోసం భర్త మర్మాంగాలపై దాడి చేసి భార్య హత్యాయత్నం
కర్నాటక విజయపుర జిల్లాలోని అక్కమహాదేవి కాలనీలో బీరప్ప, సునంద దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బీరప్ప పూజారిగా పని చేస్తూ వున్నాడు. ఐతే పూజారి వద్దకు కొన్ని రోజుల క్రితం సిద్ధప్ప అనే వ్యక్తి వచ్చాడు. బీరప్పతో పూజాది కార్యక్రమాలు చేయించుకున్నాడు కానీ అతడి భార్య సునందపై కన్నేసాడు. ఏదో ఒక వంకతో వారి ఇంటికి తరచూ రావడం ప్రారభించాడు. అలా క్రమంగా సునందతో స్నేహాన్ని పెంచుకున్నాడు. కొద్దిరోజుల్లోనే సునందను లొంగదీసుకుని ఆమెతో వివాహేతర సంబంధాన్ని సాగించాడు.
 
భర్త పనిపై పక్క ఊళ్లకు వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేవారు. ఐతే ఈమధ్య భర్త బీరప్ప ఇంటికే పరిమితమై ఎక్కడికీ వెళ్లడంలేదు. దాంతో ప్రియుడితో గడిపే అవకాశం లభించకపోవడంతో తమ సుఖానికి అడ్డుగా వున్న భర్తను చంపేయాలని నిర్ణయించుకున్నది సునంద. విషయాన్ని ప్రియుడు సిద్ధప్పకు చెప్పింది. అర్థరాత్రి వేళ ఇంటికి రావాలని కోరింది. ప్రియుడు సిద్ధప్ప రాగానే ప్రణాళిక ప్రారంభించింది. గాఢ నిద్రలో వున్న భర్త బీరప్ప గొంతు నులుముతూ అతడి మర్మాంగాలపై దాడి చేయడం మొదలుపెట్టింది.
 
ప్రియుడు సిద్ధప్ప కూడా ఆమెకి సహకరించాడు. ఐతే బీరప్ప శక్తినంతా కూడదీసుకుని కాళ్ల వద్ద వున్న కూలర్ పైన గట్టిగా తన్ని పెద్ద శబ్దం చేసాడు. ఆ శబ్దానికి ఇల్లు అద్దెకి ఇచ్చిన యజమాని తన భార్యతో సహా వచ్చేసారు. పిల్లల్లో పెద్దవాడు తలుపు గడియ తీయడంతో సునంద ఆమె ప్రియుడు ఇద్దరూ దొరికిపోయారు. తనపై హత్యాయత్నం చేసిన భార్య, ఆమె ప్రియుడిపై బీరప్ప ఫిర్యాదు చేయడంతో ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో దాడులకు కుట్ర... పాక్ దౌత్యవేత్తకు ఎన్.ఐ.ఏ సమన్లు