Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

Advertiesment
murder

ఠాగూర్

, ఆదివారం, 12 జనవరి 2025 (15:39 IST)
పదేళ్ళ క్రితం పక్కింటి కుర్రోడితో తమ కుమార్తె పారిపోయింది. పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టింది. ఈ జంటకు ఓ బిడ్డపుట్టింది. అయితే, తమ కుమార్తె లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి తండ్రి, సోదరుడు.. ఆ బిడ్డతో పాటు తమ వియ్యంకురాలిని హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్రదేశ్ రాష్ట్రంలోని హయత్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ పరువు హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన రామ్‌నాథ్, ప్రేమ్‌పాల్ అనే ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. పదేళ్ల క్రితం ప్రేమ్‌పాల్ కుమార్తె ఆశాదేవి రామ్‌నాథ్ కుమారుడు  విజయ్‌తో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టారు. కూలీపని చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ జంటకు కుమార్తె పుట్టగా కల్పన అనే పేరు పెట్టుకున్నారు. 
 
ఈ దంపతులిద్దరూ పని చేసుకుంటా తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, కుమార్తెకు ఆరు నెలలు నిండగానే బిడ్డ ఆలనాపాలనా చూసుకునేందుకు నాయనమ్మ వద్ద అప్పగించారు. అప్పటి నుంచి ఆ బిడ్డ యూపీలోని హయత్ నగర్‌లో ఉండే నాయనమ్మ ఇంట ఉంటుంది. 
 
అయితే, పదేళ్ల క్రితం తమకుమార్తె ఆశాదేవి లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. పదేళ్ల నుంచి తండ్రి రామ్ పాల్ పగతో రగిలిపోతూ వచ్చాడు. ఈ క్రమంలో రామ్ నాథ్ లేని సమయంలో ఆయన భార్య గీతాదేవిని, మనవరాలు కల్పనను ప్రేమ్ పాల్, ఆయన కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. కల్పన తనకూ మనవరాలేననే విషయం కూడా ప్రేమ్ పాల్ పట్టించుకోకుండా దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో