Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

Advertiesment
bride

ఐవీఆర్

, సోమవారం, 19 మే 2025 (16:22 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడికి మండపం వద్ద ఎదురుగా వధువు శవమై ఎదురు వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే... పెళ్లి ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా వధువు కడుపు నొప్పితో మెలికలు తిరగసాగింది. రుతుస్రావమేమోనని అనుమానపడ్డ వధువు బంధువులు దగ్గర్లో ఉన్న ఒక క్వాక్ డాక్టర్ దగ్గర మందు తెచ్చి ఆమెకి వేసారు. ఆ మందు సేవించిన మరుక్షణమే వధువు ప్రాణాలు విడిచింది.
 
కన్నౌజ్‌లోని గుర్సహైగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కిష్వాపూర్ గ్రామానికి చెందిన మహేష్ బాథమ్ కుమార్తె 22 ఏళ్ల రింకీకి శనివారం వివాహం జరపాల్సి వుంది. కానీ ఆ రోజు సాయంత్రం ఆమెకి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆమెను గ్రామంలోని ఒక క్వాక్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ ఇచ్చిన మందు రింకి వేసుకుంది, కానీ ఆ మందు తీసుకున్న కొంత సమయం తర్వాత ఆమె పరిస్థితి మరింత దిగజారింది.
 
మందు సేవించిన దగ్గర్నుంచి వధువు తీవ్రమైన నొప్పితో ఏడుస్తోంది. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. గ్రామ ప్రజలు, బంధువులందరూ మండపానికి వస్తున్న వరుడు బ్యాండ్ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడంలో నిమగ్నమయ్యారు. బంధువులందరూ వివాహ ఊరేగింపును స్వాగతించడానికి గుమిగూడారు. ఈలోగా రింకి ఆరోగ్యం క్షీణించి ఆమె మరణించింది. దీనితో పెళ్లి ఇంట్లో గందరగోళం నెలకొంది, రింకి తల్లితండ్రి స్పృహ కోల్పోయారు.
 
రింకి మరణంతో గ్రామం మొత్తం విషాదంలో నిండిపోయింది. అందరూ ఆమె వినయపూర్వకమైన స్వభావం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక క్వాక్ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా 22 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిందనీ, అలాంటి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అచీవర్స్ డే సందర్భంగా అత్యుత్తమ విద్యార్థులకు అవార్డులు అందజేసిన కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్