Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొబైల్ ఫోన్ కోసం నానమ్మ దారుణ హత్య.. శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టినవైనం...

murder

ఠాగూర్

, ఆదివారం, 17 మార్చి 2024 (10:21 IST)
ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్లలో దారుణం జరిగింది. సొంత నానమ్మను చంపి, ఆమె ఒంటిపై బంగారం తస్కరించి, మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టాడు ఓ మనవడు. ఖరీదైన సెల్ఫోన్ కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో శనివారం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మ (80) కు చిన్నబజారి, పెద్దబజారి అనే ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడు చిన్నబజారి కర్నూలులో స్థిరపడినా, ఊళ్లోనే సొంతింటిని నిర్మించి ఆ ఇంట్లో తన తల్లి నాగమ్మను ఉంచాడు. పెద్ద కుమారుడు పెద్దబజారి గ్రామంలో కూలి పనులు లేక పోవడంతో బతుకుదెరువు కోసం గుంటూరుకు భార్య, పిల్లలతో వలసవెళ్లాడు. వారి కుమారుడు వెంక‌టేశ్ అక్కడ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. 
 
కొత్త సెల్‌ఫోన్ కొనాలనుకున్నాడు. కానీ డబ్బులు లేక పోవడంతో ఓ పథకం వేశాడు. తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి పెద్దమరివీడుకు వచ్చాడు. తన నానమ్మ నాగమ్మ దగ్గర ఉన్న బంగారాన్ని దొంగలించి ఆ డబ్బుతో ఖరీదైన మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఈ నెల 4వ తేదీ సాయంత్రం నాగమ్మ ఉన్న ఇంటికి నాగమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులు వెళ్లాడు. అక్కడ నాగమ్మ గొంతు నులిమి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. రాత్రి ఎవరూ తిరగని సమయంలో ఇంటి ఆవరణలో గుంత తవ్వి నాగమ్మను పూడ్చివేశాడు. 
 
ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఉదయం ఎమ్మిగనూరుకు వెళ్లి అక్కడ ఓ దుకాణంలో బంగారాన్ని రూ.29వే విక్రయించాడు. రూ.25 వేల పెట్టి కొత్త సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. సాయంత్రం గుంటూరులోని తన తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్లాడు. ఇంతలో ఈ నెల 13వ తేదీన నాగమ్మ చిన్నమనుమడు గోపాల్ గ్రామానికి వచ్చాడు. తన నానమ్మ నాగమ్మ ఇంట్లో లేకపోవడంతో అనుమానం వచ్చి గోనెగండ్ల పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు. వెంకటేశ్ నాగమ్మ వద్దకు వచ్చి వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరగడంతో తమదైనశైలిలో వెంకటేశ్‌ను విచారించగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగరా.... మొత్తం ఓటర్లు ఎంతమంది?