Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంద్యాలలో దారుణం - ప్రేమించలేదని పెట్రోల్ పోసి చంపేశాడు...

Woman Fire

ఠాగూర్

, సోమవారం, 9 డిశెంబరు 2024 (11:07 IST)
ఏపీలోని నంద్యాలలో దారుణం జరిగింది. ఓ ప్రేమించలేదని ఓ యువతిపై కిరాతకుడు పెట్రోల్ పోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరు - బైరెడ్డి నగర్‌కి చెందిన ఇంటర్ విద్యార్థిని లహరి (17)ని ప్రేమ పేరుతో వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర అనే ప్రేమోన్మాది వేధించసాగాడు. అయితే, ఆ యువతి ఆమె ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. 
 
దీన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమోన్మాది... ఆదివారం రాత్రి ఇంట్లోకి దూరి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, రాఘవేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Love: బాలిక‌కు నిప్పంటించిన ప్రేమోన్మాది... బాలుడికి కూడా నిప్పు అంటుకోవడంతో?