Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు.. ఎందుకని?

Advertiesment
murder

ఠాగూర్

, బుధవారం, 9 జులై 2025 (08:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల మేరకు... పిట్టలోనిగూడేనికి చెందిన కాల్వ కనకయ్య (30) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం గుజులోతు చిన్నరాజయ్య, జున్నూబాయి దంపతుల కుమార్తె చుక్కమ్మ అలియాస్ శిరీష‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇదే గూడేనికి చెందిన గుజులోతు క్రిష్టమ్మ కుమార్తె గౌరమ్మను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు.
 
ఈ క్రమంలో మద్యానికి బానిసైన కనకయ్య ఇద్దరు భార్యలను నిత్యం వేధించసాగాడు. ఈ క్రమంలో మే 15వ తేదీన కనకయ్య తన అత్తమామలపైన జుున్నూభాయి, చిన్నరాజయ్యపై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జున్నూభాయి మృతి చెందగా, చిన్నరాజయ్య గాయాలతో బయపటపడి చికిత్స పొందుతున్నాడు. అప్పటి నుంచి కనకయ్య పరారీలో ఉన్నాడు. భార్యలిద్దరూ తమతమ తల్లిదండ్రుల వద్ద తలదాచుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న కనకయ్య సోమవారం రాత్రి గ్రామానికి వచ్చి భార్యలిద్దరినీ చంపేస్తానంటూ గొడ్డలితో బెదిరించాడు. దీంతో తన తల్లిని హత్య చేశాడన్న కోపంతో ఉన్న మొదటి  భార్య చుక్కమ్మ అదే గొడ్డలితో కనకయ్యపై ఎదురుదాడి చేశాడి. అదేసమయంలో అక్కడకు చేరుకున్న రెండో భార్య గౌరమ్మ ఆమె సోదరులైన జనార్థన్, శ్రీనివాస్ సహకారంతో కనకయ్యను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క