Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదేళ్లపాటు ప్రేమ, ప్రేయసిని వదిలేసి పెళ్లిచూపుల్లో నచ్చిన అమ్మాయి కోసం సిద్ధమయ్యాడు..

Advertiesment
పదేళ్లపాటు ప్రేమ, ప్రేయసిని వదిలేసి పెళ్లిచూపుల్లో నచ్చిన అమ్మాయి కోసం సిద్ధమయ్యాడు..
, మంగళవారం, 25 జనవరి 2022 (17:25 IST)
పదేళ్ళ ప్రేమ. ఐదేళ్ళు శారీరకంగా ప్రియుడితో కలిసింది. అతనే సర్వస్వం అనుకుంది. పెళ్ళి చేసుకుని హాయిగా జీవిద్దామనుకుంది. చిన్ననాటి స్నేహితుడు మోసం చేయడని గట్టిగా నమ్మింది. కానీ ఆ యువకుడు మాత్రం ఇంకో పెళ్ళికి సిద్థపడ్డాడు. దీంతో అసలు గొడవ ప్రారంభమైంది.

 
కర్ణాటక రాష్ట్రం కోలార్ తాలూకా అరభికొత్తనూర్ గ్రామానికి చెందిన అంబికా, మహేష్‌లు పదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళు 5వ తరగతి నుంచే ఫ్రెండ్స్. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తరువాత శారీరకంగా దగ్గర చేసింది. 

 
వీరిద్దరి ప్రేమాయణం ఇంట్లో పెద్దవారికి తెలియదు. ముఖ్యంగా అంబికా ఇంట్లో అస్సలు తెలియదు. ఉద్యోగంలో బాగా స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుందామని మహేష్ షరతులు పెట్టాడు. దీంతో అంబికా కూడా ఒకే చెప్పింది. ఇంట్లో మహేష్ విషయాన్ని గోప్యంగా ఉంచింది.

 
అయితే వారం రోజుల క్రితం మహేష్‌కు ఇంట్లో పెద్దలు పెళ్ళి చేసేందుకు సిద్థమయ్యారు. పెళ్ళి చూపులు కూడా చూశారు. పెళ్ళి చూపుల్లో అమ్మాయి అందంగా ఉండటంతో మహేష్ ఒకే చెప్పేశాడు. అందులోను కట్నం బాగా వస్తుందన్న ఆశతో ప్రేమించిన యువతిని మర్చిపోయాడు. 

 
నిన్న మహేష్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అంబిక తాను మోసపోయానన్న విషయాన్ని తన ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి నేరుగా మహేష్ ఇంటికి వెళ్ళింది. న్యాయం చేయాలంటూ ఆందోళన చేసింది. దీంతో నిశ్చితార్థం కాస్త ఆగిపోయింది. పంచాయతీ పోలీసుల వరకు వెళ్ళింది. 

 
తనతో మహేష్ సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెట్టింది అంబిక. దీంతో మహేష్ అవాక్కయ్యాడు. అయితే అంబికా నన్ను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ పోలీసులకు రిటర్న్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇనార్బిట్‌ హైదరాబాద్‌ ప్రత్యేకమైన రిపబ్లిక్‌ దినోత్సవ ఆఫర్లు