Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీమిండియా ఓడిపోయింది.. అభిమాని గుండె ఆగింది...

Advertiesment
టీమిండియా ఓడిపోయింది.. అభిమాని గుండె ఆగింది...
, గురువారం, 11 జులై 2019 (12:14 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఓ ఓటమిని జీర్ణించుకోలేని అభిమాని ఒకరు టీవీ చూస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) అనే వ్యక్తికి క్రికెట్ అంటే అమితమైన పిచ్చి. దీంతో భారత ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తూ వస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాటం చేసినప్పటికీ.. 18 పరుగులు తేడాతో ఓడిపోక తప్పలేదు. ఎంతో ఉత్కంఠకు రేపిన ఈ మ్యాచ్‌ను చూస్తూ అతను టెన్షన్‌కు గురయ్యాడు. భారత ఓడిపోతుందని తెలియడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాముకు గుండెపోటు రావడంతో టీవీ ముందే కుప్పకూలిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ విగతజీవుడిగా మారిపోయాడు. అప్పటివరకు తమతో కలిసి టీవీలో మ్యాచ్‌ను వీక్షించిన రాము... కొన్ని క్షణాల్లో తీరని లోకాలకు చేరుకోవడంతో గ్రామవాసులంతా శోకసముద్రంలో మునిగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట్ల మంది హృదయాలు భగ్నమయ్యాయి.. కానీ పోరాటం అద్భుతం : రాహుల్