Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ క్రికెట్ వీరాభిమానికి ధోనీ ఫిదా.. ఏం చేశాడో తెలుసా?

Advertiesment
2019 Cricket World Cup
, సోమవారం, 17 జూన్ 2019 (19:52 IST)
నిజానికి ఆయన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీరాభిమాని. పైగా, కరుడుగట్టిన పాకిస్థానీయుడు. ముఖ్యంగా, భారత్, పాకిస్థాన్ జట్లు ఎక్కడ తలపడుతున్నా అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు. మ్యాచ్ టిక్కెట్స్‌ను ఏదో విధంగా సంపాదించుకుని స్టేడియంలోకి ప్రవేశించి సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఆయన పేరు మొహమ్మద్ బషీర్. యూఎస్-పాక్ పౌరుడు. అలాంటి వ్యక్తికి భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా మారిపోయాడు. ఫలితంగా బషీర్‌కు అవసరమైన మ్యాచ్ టిక్కెట్స్‌ను ధోనీయే సమకూర్చుతుంటాడు. గత 2011 సంవత్సరం నుంచి ఈ టిక్కెట్లు సమకూర్చుతున్నాడు. 
 
ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం బషీర్ చికాగో నుంచి మాంచెష్టర్‌కు 6 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంతదూరం వెళుతున్న బషీర్ చేతిలో మాత్రం టిక్కెట్స్ లేవు. కానీ, మహేంద్ర సింగ్ ధోనీపై ఉన్న నమ్మకంతో బషీర్ అంతదూరం ప్రయాణించాడు. అతను అనుకున్నట్టుగానే బషీర్‌కు ధోనీ ఇండోపాక్ మ్యాచ్ టిక్కెట్లను సమకూర్చాడు. 
 
దీనిపై పీటీఐ వార్తా సంస్థతో ఈ అమెరికా పాస్‌పోర్టు వాసి అయిన బషీర్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ కోసం ఒక రోజు ముందుగానే వచ్చాను. కానీ, ఒక టిక్కెట్ కోసం 800 నుంచి 900 పౌండ్ల మేరకు ఖర్చు చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. అంటే.. మాంచెష్టర్ నుంచి చికాగోకు తిరుగు ప్రయాణ టిక్కెట్‌ ధరతో ఇది సమానం. అయితే, తాను మాత్రం టిక్కెట్స్ కోసం ఎలాంటి శ్రమపడలేదని, ఇందుకోసం ధోనీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు 63 యేళ్ల పాక్-అమెరికా వాసి చెప్పుకొచ్చాడు. 
 
ధోనీకి బషీర్‌కు మధ్య 2011లో జరిగిన ప్రపంచ కప్‌లో స్నేహం ఏర్పడింది. ఈ వరల్డ్ కప్‌లో మొహాలీ వేదికగా ఇండోపాక్ మ్యాచ్ జరిగింది. అపుడు కూడా బషీర్‌కు ధోనీనే టిక్కెట్లు సమకూర్చాడు. అప్పటి నుంచి వీరిమధ్య స్నేహబంధం కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా తాను ధోనీకి ఫోన్ చేయనని, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. కానీ, ఓ టెక్స్ట్ మెసేజ్ పంపుతా. దాన్ని చూసిన వెంటనే టిక్కెట్ సమకూర్చుతారని హామీ ఇస్తారని చెప్పారు. నిజంగా ధోనీ చాలా మంచి వ్యక్తి, మానవతావాది అని బషీర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢాకా పులులను చితక్కొట్టిన కరేబియన్ కుర్రోళ్లు.. బంగ్లా టార్గెట్ 322 రన్స్