Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంచనాలు లేని జట్టు.. పొట్టి ఫార్మెట్‌లో అదరగొట్టిన వేళ!

అంచనాలు లేని జట్టు.. పొట్టి ఫార్మెట్‌లో అదరగొట్టిన వేళ!
File
FILE
అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌ పోటీలో విశ్వవిజేతగా నిలిచిన జట్టు ఇంగ్లండ్. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ జట్టు కుర్రాళ్లు టోర్నీ ఆద్యంతం అదరగొట్టారు. ఓటమితో ట్వంటీ-20 టోర్నీని ప్రారంభించిన కాలింగ్‌వుడ్ సేన్.. ఫైనల్‌లో పటిష్టమైన, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఖంగుతినిపించి పొట్టి క్రికెట్‌ కప్‌ను కైవసం చేసుకుంది. తద్వారా.. క్రికెట్ దిగ్గజాలు బ్రయర్లీ, మైక్‌ గ్యాటింగ్, గ్రహం గూచ్‌, ఆర్థటన్‌, మైకేల్‌ వాన్‌‌ వంటి వారికి సాధ్యం కానిదాన్ని ఈ అంచనాలు లేని జట్టు సుసాధ్యం చేసింది.

పక్కా ప్రణాళికతో జట్టులో ఏ ఒక్క ఆటగాడిపైనా ఆధారపడకుండా సమిష్టిగా జట్టును ముందుండి నిడిపి విశ్వహీరో అయ్యాడు. పీటర్సన్‌ (కేపీ) మినహా పెద్దగా స్టార్‌ హోదాలేని ఆటగాళ్లతో కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన కాలింగ్‌వుడ్.. తన పదునైన వ్యూహాలను పక్కాగా అమలు చేసి కీస్వెట్టర్‌, పీటర్సన్‌, మోర్గాన్‌, బ్రాడ్‌, సైడ్‌బాటమ్‌, స్వాన్‌... ఇలా ప్రతి ఒక్కరినీ మ్యాచ్ విన్నర్లుగా మలిచాడు. ఫలితంగా కప్‌ను ఎగురేసుకెళ్లాడు.

క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్‌లో ఒక్క అంతర్జాతీయ ఈవెంట్‌లలో విజేతగా నిలువలేదు. 1979లో జరిగిన ప్రపంచకప్‌లో తొలిసారి వెస్టిండీస్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత 1986లో ఉపఖండంలో జరిగిన ప్రపంచకప్‌లో చివరి వరకు పోరాడి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. మళ్లీ 1992లో తుది మెట్టు వద్ద బోల్తా పడింది. సూపర్‌ ఫామ్‌లో ఉండి 2004లో ఛాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరినా మళ్లీ పాత చరిత్రే పునరావృతం అయింది. 2010లో మాత్రం సారథి కాలింగ్‌వుడ్ పక్కా ప్రణాళికతో కప్‌ను కొట్టేశాడు.

కాలింగ్‌వుడ్ ఒక సారథిగా జట్టులో స్ఫూర్తి నింపాడు. ఆటగాళ్లందరితో కలిసిపోయి తాను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఓపెనర్లుగా లంబ్‌-కీస్వెటర్‌లు ఇద్దరూ కొత్త వారే అయినప్పటికీ, వారు అంచనాలకు మించి రాణించడం బాగా కలిసి వచ్చింది. ఇక కెవిన్‌ పీటర్సన్‌ బ్యాటింగ్‌లో పెద్దన్న పాత్ర వహించగా, మోర్గాన్‌, బౌలింగ్‌లో బ్రాడ్‌, సైడ్‌ బాటమ్‌, స్వాన్‌, యార్టీలు పోటీ పడి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు.

Share this Story:

Follow Webdunia telugu