స్వదేశంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు అనుకున్నట్టుగానే 'టీమ్ ఇండియా' కెప్టెన్ అనిల్ కుంబ్లే దూరమయ్యాడు. కుంబ్లే స్థానంలో అమిత్ మిశ్రాకు చోటు కల్పించారు. టెస్ట్ మ్యాచ్‌కు కుంబ్లే దూరం కావడంతో కెప్టెన్ బాధ్యతలను వన్డే కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ చేపట్టాడు.
కాగా, టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా గంభీర్, సెహ్వాగ్‌లు క్రీజ్‌లోకి వచ్చారు. వీరిద్దరు.. తొలి నాలుగు ఓవర్లలో 25 పరుగులతో మంచి శుభారంభం చేశారు. గవాస్కర్-బోర్డర్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతుంది.
ఇదిలావుండగా.. బెంగుళూరులో జరిగిన తొలిటెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లతో పాటు.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఆసీస్ జట్టు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనపరిచి, శభాష్ అనిపించుకున్నారు.
ఇరు జట్ల వివరాలు..
భారత్.. గంభీర్, సెహ్వాగ్, ద్రావిడ్, టెండూల్కర్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ, మిశ్రా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ మిశ్రా.
ఆస్ట్రేలియా.. కటిచ్, హైడెన్, పాంటింగ్, మైక్ హుస్సే, క్లార్క్, వాట్సన్, హ్యాడ్డిన్, వైట్, బ్రెట్ లీ, సైడిల్, జాన్సన్.