మొహలీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ద్రావిడ్ (39), గంభీర్ (67)లు వెంట వెంటనే ఔట్ కావడంతో భారత శిభిరంలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 148 పరుగుల వద్ద కొనసాగుతోంది. సచిన్ (0), లక్ష్మణ్ (2)లు క్రీజులో ఉన్నారు.
ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. అయితే ఓపెనర్ సెహ్వాగ్ (35) జాన్సన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత స్కోరు బోర్డు కాస్త మందగించింది. ఈ సమయంలో గంభీర్‌తో కలిసి ద్రావిడ్ జట్టును ఆదుకునే పనిలో పడ్డాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించారు.
ఈ స్థితిలో బ్రెట్‌లీ బౌలింగ్‌లో ద్రావిడ్ ఔట్ అయ్యాడు. ద్రావిడ్ ఔట్ అయిన కొద్ది సేపటికే ఓపెనర్ గంభీర్ సైతం జాన్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు.