మొహాలీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. మూడో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండా ఓపెనర్ స్ట్రాస్ (0) వికెట్‌ను కోల్పోయింది. జహీర్ ఖాన్ వేసిన తొలి ఓవర్లోనే ఈ ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఇషాంత్ శర్మ మరో దెబ్బ తీశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన బెల్ ఇషాంత్ రివర్స్ స్వింగ్ బంతిగి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అప్పటి ఇంగ్లండ్ స్కోరు ఒక్క పరుగు మాత్రమే. అయితే మరో ఓపెనర్ కుక్ (50), కెప్టెన్ పీటర్సన్లు జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. ఆ తర్వాత ఖాన్ మరో సారి రెచ్చిపోయి బెల్‌ను వికెట్ల ముందు దొరకిపోయాడు. అలాగే కాలింగ్‌వుడ్ (11) అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిగిరాడు.
అయితే.. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ పీటర్సన్‌తో ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ జతకట్టి జట్టును సురక్షిత తీరానికి చేర్చారు. కెప్టెన్ సెంచరీ చేయగా, ఫ్లింటాఫ్ అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 261 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. అంతకుముందు భారత్ తన తొలిఇన్నింగ్స్‌లో 453 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే.