భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న టెస్ట్‌లో భాగంగా ఆసీస్ లంచ్ విరామానికి మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. చివరి టెస్ట్ అయిదో రోజు ఆట ప్రారంభం అయిన వెంటనే భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టి టీం ఇండియా జట్టుకు ఆధిక్యం సంపాదించి పెట్టారు.
ఓపెనర్ కటిచ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిగాడు. అప్పటికే ఆసీస్ 29 పరుగులు తీసింది.
ఆ తర్వాత ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రికీ పాంటింగ్... అవతి ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా మెరుపువేగంతో బంతిని అందుకోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.
తర్వాత బరిలోకి దిగిన క్లార్క్ 22 పరుగుల వద్ద ధోనీ బౌలింగ్‌కు... ఇషాంత్ శర్మ క్యాచ్‌తో ఇంటిముఖం పట్టాడు. ప్రస్తుతం హేడెన్ అర్థసెంచరీకి చేరువలో (46 పరుగులు), హస్సీ (14 పరుగులు)లతో క్రీజులో ఉన్నారు.