బెంగళూరులో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తొలి టెస్ట్ మూడో రోజైన శనివారం భారత్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులతో సరిపెట్టుకుంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు సాధించింది.
ఆట ముగియనున్న కొద్ది సమయానికి ముందే షేన్ వాట్సన్ వికెట్‌కు హర్భజన్ 54 పరగులతో అవుటయ్యాడు. భజ్జీ స్థానంలో క్రీజులోకి వచ్చిన అనిల్ కుంబ్లే ఇంకా తన ఆటను ప్రారంభించలేదు. ఆట ముగిసే సమయానికి జహీర్ ఖాన్ 35 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.
ఇకపోతే... ఇన్నింగ్స్ మొదటి నుంచే ఆస్ట్రేలియా బౌలింగ్‌కు తడబడిన భారత్ మెల్లమెల్లగా కోలుకుని ఫామ్‌లోకి వచ్చింది. భారత్ ఆటగాళ్లలో ద్రావిడ్ (51 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (47 పరుగులు) చేసి జట్టుకు మేలు చేశారు. గౌతమ్ గంభీర్ (21 పరుగులు), సచిన్ టెండూల్కర్ (13 పరుగులు), మహేంద్ర సింగ్ ధోనీ 9 పరుగులతో ఆసీస్ బౌలర్ల చేజిక్కారు.