మొహాలీలో భారత్‌తో జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడం పట్ల ఆ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. సరైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేదని, నాయకుడే తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని ఇలా పలు రకాల విమర్శలు ఆ దేశ మాజీ క్రికెటర్లు చేస్తున్నారు.
ఈ ఓటమిపై పాక్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ జట్టు ఆటగాళ్ళ ప్రతిభను కెప్టెన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదని ఆరోపించారు. భారత జట్టు ఒక దశలో 150 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ ఆఫ్రిది ఒత్తిడి పెంచలేక పోయారన్నారు.
లెగ్‌స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ స్పందిస్తూ పాక్ బ్యాటింగ్ లైనప్ సరిగాలేన్నారు. సెమీఫైనల్ ఓటమితోనైనా పాక్ మెనేజ్మెంట్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ప్రపంచకప్‌లో ఏ ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయలేదని, ఎనిమిది మ్యాచ్‌ల్లో మిస్బావుల్ హక్ మాత్రమే 248 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. బ్యాటింగ్ లైనప్ సరిగా లేదనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
మరో మాజీ ఓపెనల్ అమీర్ సొహైల్ మాట్లాడుతూ ఆఫ్రిది డిఫెన్సివ్ కెప్టెన్సీ ఓటమి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. ఆఫ్రిదిపై మరో టెస్ట్ ఆటగాడు అబ్దుల్ బాసిత్ కూడా ఆఫ్రిది కెప్టెన్స్‌ను విమర్శించడమే కాకుండా మరో అడుగు ముందేసి వకార్ యూనిస్‌పై నిందలు వేశారు. సరియైన ఆలోచన విధానంతో ఆటగాళ్లను వకార్ నడిపించలేకపోయారని విమర్శించారు.