నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొహలీలో భారత్ చేతిలో పరాభవం చవిచూసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఎలాగైనా సరే నెగ్గి తీరాలని పంతం మీద బరిలోకి దిగింది.
ఢిల్లీ టెస్ట్‌తోనే సిరీస్ తమ వశం చేసుకుంటామని భారత ఆటగాళ్లు ధీమాగా సవాల్ విసరగా.. మొహలీ టెస్టుకు బదులు తీర్చుకుంటామని అస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక స్పిన్నర్లలో ఎవరిని బరిలోకి దింపడమా అని తర్జనభర్జనలు పడ్డ భారత్ ఎట్టకేలకు హర్భజన్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది.
ఆ స్థానంలో అమిత్ మిశ్రాను ఎంపిక చేసింది. నెట్ ప్రాక్టీసులో పూర్తి ఫిట్‌నెస్ ప్రదర్శించిన అనిల్ కుంబ్లే ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి చేరాడు. ఇక ఆస్ట్రేలియా మాత్రం పెద్దగా మార్పులేమీ చేయకుండానే బరిలోకి దిగింది.
భారత జట్టు
గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మా, అమిత్ మిశ్రా
ఆస్ట్రేలియా జట్టు
ఎస్ఎం. కటిచ్, మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్, మైక్ హస్సీ, మైఖేల్ క్లార్క్, ఎస్ఆర్ వాట్సన్, బ్రాడా హాడిన్, బ్రెట్ లీ, మిట్చెల్ జాన్సన్, స్టువార్ట్ క్లార్క్