గవాస్కర్ - బోర్డర్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కష్టాల బాటలో పయనిస్తోంది. 382 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కంగారులు.. ఐదు వికెట్లను కోల్పోయి పరాజయం దిశగా పయనిస్తున్నారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ హెడెన్ తన వ్యక్తిగత స్కోరు 77 వద్ద హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
దీంతో ఆస్ట్రేలియా జట్టు 154 పరుగుల వద్ద కోల్పోయింది. నాలుగో రోజు స్కోరు 13 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోంది. ఆసీస్ ఓపెనర్ కటిచ్ (16) వికెట్‌తో ఇషాంత్ శర్మ వికెట్ల ఖాతా ప్రారంభించాడు. ఆ తర్వాత ఆసీస్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమై వికెట్లను అప్పగిస్తున్నారు.