చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆండ్రూ స్ట్రాస్ (73), పాల్ కాలింగ్‌వుడ్ (60)లు నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 69 పరుగుల అమూల్యమైన అధిక్యాన్ని కూడబెట్టుకోగా, మొత్తం మీద ఇప్పటి వరకు 237 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది.
అంతకుముందు భారత్ 241 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లను కూల్చడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇదే అదునుగా భావించిన స్ట్రాస్, కాలింగ్‌వుడ్ ద్వయం అభేద్యమైన నాలుగో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, యువరాజ్ సింగ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇయాన్ బెల్ (9), అలెస్టర్ కుక్ (7) పీటర్సన్ (1)లు తక్కువ స్కోరుకే అవుట్ అయినా, భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేక పోయారు.