Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్-4 వేలంలో బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీకి పరాభవం!

Advertiesment
ఐపీఎల్-4 వేలంలో బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీకి పరాభవం!
FILE
టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం జరిగిన వేలం పాటలో పరాభవం ఎదురైంది.

ఒకప్పడు టీమిండియాకే గాకుండా ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా కెప్టెన్సీ సారథ్యం వహించిన గంగూలీని బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్-4 వేలం పాటలో బెంగాల్ దాదాను కొనుగోలు చేసే ఫ్రాంచైజీలు కరువయ్యారు. తొలి రోజు కాకపోయినా రెండో రోజయినా ఏదో ఒక జట్టు గంగూలీని పట్టించుకోలేదు.

ఐపీఎల్ వేలం సందర్భంగా గంగూలీ కనీస ధర రూ.1.84 కోట్లుగా నిర్ణయించడం కూడా ప్రతిబంధకంగా మా రింది. ఎలాగంటే తొలి రోజు వేలంలో అమ్ముడవ్వని దాదాను రెండోరోజు కొందామంటే ఫ్రాంచైజీల వద్ద అంత నగదు లేకపోవడం కూడా కారణమైంది.

మొదటిరోజు ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు భారీ వెచ్చించగా, రెండో రోజు కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ. 1.92 కోట్లు, చెన్నయ్ వద్ద రూ.1.74 కోట్లే మిగిలున్నాయి. ఇక మిగిలిన ఫ్రాంచైజీలదీ దాదాపు ఇదే పరిస్థితి. ఈ కారణంతోనే బెంగాల్ దాదా అమ్ముడు పోలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విధంగా గంగూలీని వేలం పాటలో లెక్కచేయకపోవడంతో ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ కోపంతో గంగూలీ అభిమానులు గంగూలీ కెప్టెన్‌గా ఉండిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వ్యతిరేకంగా కోల్‌కతాలో ప్రదర్శనలు సైతం నిర్వహించారు. అంతేకాదు.. కేకేఆల్ యజమాని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ అసంతృప్తిని బెంగాల్ దాదా ఫ్యాన్స్ వ్యక్తం చేశారు.

కేకేఆర్‌తో పాటు మరే జట్టు దాదాను తీసుకోకపోవడంతో నిరాశకు గురైన దాదా అభిమానులు "నో సౌరవ్, నో క్రికెట్" అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, నైటరైడర్స్ కోల్‌కతాలో ఆడే మ్యాచ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

ఇకపోతే.. ఐపీఎల్ వేలం పాటలో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోని ప్రముఖుల్లో సౌరవ్ గంగూలీతో పాటు శ్రీలంక డాషింగ్ ఓపెనర్ సనత్ జయసూర్య, న్యూజిలాండ్‌కు చెందిన జేకబ్ ఓరమ్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చంద్రపాల్, దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ ఎన్తిని, క్రిస్ గేల్, బౌచర్ లాంటి వారు కూడా ఉన్నారు.

కాగా, ఐపీఎల్ వేలంలో ఏకంగా 11 కోట్ల రూపాయలు పలకడంతో ఢిల్లీకి చెందిన క్రికెట్ ఇండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ బ్రాండ్ విలువ ఒక్కసారిగా పెరిగి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu