రాజ్‌కోట్‌లో జరిగిన తొలి వన్డేలో పరుగుల వర్షం కురిపించిన భారత్ ఆటగాళ్లకు రెండో వన్డేలో ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్‌లో సోమవారం జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన గౌతం గంభీర్ 76 బంతుల్లో... ఆరు ఫోర్లతో.. 70 పరుగులు చేసి ఇంగ్లాండ్ కెప్టెన్ పీటర్సన్ బౌలింగ్‌లో పెవీలియన్ దారి పట్టాడు. ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విఫలం అయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి బ్రాడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
అనంతరం బరిలో దిగిన రైనా (4 పరుగులు) , శర్మ (3 పరుగులు)లు తక్కువ స్కోరు వద్దే పటేల్, షా చేతిలో అవుటయ్యారు.. ఇకపోతే... తొలి వన్డేలో సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ (99 పరుగులు), మహేంద్ర సింగ్ ధోనీ (15 పరుగులు) క్రీజులో ఉన్నారు.