Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియా అంటే ఇండియా ఎందుకు భయపడాలి?

Advertiesment
ఆస్ట్రేలియా అంటే ఇండియా ఎందుకు భయపడాలి?
ఆస్ట్రేలియా జట్టు నుంచి గిల్‌క్రిస్ట్, హెడెన్, మెక్‌గ్రాత్, షేన్‌వార్న్, గిలెస్పీ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు రిటైర్ కావటంతో తమ అజేయ శకాన్ని ఎక్కువ రోజులు కొనసాగించటం సాధ్యపడకపోవచ్చు. అయితే ఇప్పటికి ఆస్ట్రేలియా జట్టు ఇతర జట్ల మీద పై చేయి సాధించటానికి దోహదపడుతున్న అంశం ఫీల్డింగ్. కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాడు స్టీవెన్ స్మిత్ అద్బుత క్యాచ్‌తో పాటు చేసిన రనౌట్ మ్యాచ్‌ మీద ప్రభావం చూపడమే వారి ఫీల్డింగ్ పటిమకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కీలక సమయంలో ఈ జట్టు తమ ఫీల్డింగ్‌తో అద్బుతాలు సృష్టించగలదు.

ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే ప్రస్తుత జట్టులో కీలక ఆటగాళ్లు షేన్ వాట్సన్, మైకెల్ హస్సీ. షేన్ వాట్సన్ గ్రౌండ్ నలువైపులా షాట్లతో బౌలర్లపై విరుచుకుపడతాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్ వాట్సన్. కాగా హస్సీ మ్యాచ్‌కి చాలా సులువుగా ముగింపు పలికే ఆటగాడు. గాయం వల్ల తొలి మ్యాచ్‌లకు జట్టుకు అందుబాటులేని హస్సీ తన సత్తాను ఇంకా ప్రదర్శించలేదు. పరుగుల చేయటానికి ఆకలి కొన్న పులిలా వేచియున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ తరుపున భారత్‌లో ఆడటం వాట్సన్‌కి కలసివచ్చే అంశం.

బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, షాన్ టైట్‌లతో కూడిన ఫేస్ త్రయం ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లందరికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. బహుశా ఇండియా మోతేరాలో తొలి పెద్ద పేస్ బౌలింగ్ పరీక్షను ఎదుర్కోవాల్సివుంది. తొలుత లీ, టైట్ తమ ఫేస్‌తో బెంబేలిస్తే దానిని జాన్సన్ కొనసాగించవచ్చు.

ఆస్ట్రేలియా వరుసగా మూడు సార్లు మొత్తం మీద నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ రికీ పాంటింగ్ పాల్గొన్న నాలుగు ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా మూడింట విజేతగా నిలిచింది. ప్రపంచ కప్‌లో ఈ జట్టుకు అపార అనుభవం వుంది. కీలక మ్యాచ్‌ల్లో పోరాటం చేయటంలో నిష్ణాతులు.

Share this Story:

Follow Webdunia telugu