Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసీస్ గడ్డపై సఫారీల చారిత్రాత్మక విజయం

Advertiesment
ఆసీస్ గడ్డపై సఫారీల చారిత్రాత్మక విజయం
FileFILE
విదేశీ గడ్డపై సఫారీలు చరిత్ర సృష్టించారు. సొంతగడ్డపైనే ఆస్ట్రేలియాను ఖంగు తినిపించారు. టెస్టుల్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న కంగారులకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు సరైన గుణపాఠం నేర్పారు. 414 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకకా చేధించారు. దీంతో సఫారీలు ఆరు వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటిస్తుండగా, తొలి టెస్టు పెర్త్ మైదానంలో జరిగింది. ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా ముంగిట 414 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మోచేతి గాయంతో బాధపడుతూనే సెంచరీ చేసి విజయానికి బాటలు వేసిన కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌ను ఆదర్శంగా తీసుకున్న సహచరులు మిగిలిన పనిని పూర్తి చేశారు.

ఆమ్లా (53, కెల్లీస్ (57), విలియర్స్ (106 నాటౌట్), డుముని (50 నాటౌట్)లు అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించి, విజయాన్ని అందుకున్న రెండో జట్టుగా రికార్డు పుటలకెక్కింది. ఈ విజయానికి కెప్టెన్ స్మిత్ సెంచరీతో బాటలు వేసి చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 375, రెండో ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. అలాగే దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరు 94 పరుగుల వెనుకబడింది. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలుపుకుని 414 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం దుర్లభం. అయితే క్రమశిక్షణకు, సమర్ధతకు మారుపేరైన సఫారీలు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును డీవిలియర్స్‌ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 63, రెండో ఇన్నింగ్స్‌లో 106 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Share this Story:

Follow Webdunia telugu