ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ గంగూలీ, ధోనీలు రాణిస్తున్నారు. నాలుగో టెస్ట్ తొలి రోజు ఓవర్ నైట్ స్కోరు.. 311/5తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గంగూలీ, ధోనీలు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచారు. వీరిద్దరు అవకాశం లభించినపుడు బంతిని బౌండరీ, సిక్సర్లకు బాదుతూ ఎక్కువగా సింగిల్స్‌ను తీస్తూ స్కోరును పెంచారు.
ఈ క్రమంలో గంగూలీ మరో అర్థ సెంచరీ పూర్తి చేసుకుని 64 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అలాగే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మాజీ కెప్టెన్‌కు తనవంతు సహకారం ఇస్తూ.. ఎక్కువగా సింగిల్స్ తీస్తూ స్కోరును పెంచాడు.
ప్రస్తుతం జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేయగా, గంగూలీ (64), ధోనీ (43)లు క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు లంచ్ వరకు ఆస్ట్రేలియా బౌలర్లు గంగూలీ-ధోనీల భాగస్వామ్యాన్ని విడదీయలేక పోయారు.