భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఆఖరి టెస్ట్ మ్యాచ్ గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. వెనుకాముందు ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, తమిళనాడు కుర్రాడు ఎం.విజయ్‌లు బరిలోకి దిగారు.
ఈ సిరీస్ ఆద్యంతం అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపనర్ గౌతం గంభీర్‌పై ఐసిసి ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించిన విషయం తెల్సిందే. దీంతో గంభీర్ నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. గంభీర్ స్థానంలో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న తమిళనాడు కుర్రాడు ఎం.విజయ్‌కు అదృష్టం తలుపుతట్టింది. నాగ్‌పూర్ టెస్ట్ ద్వారా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు.
డాషింగ్ ఓపెనర్ వీరూతో కలిసి ఇన్నింగ్స్ అరంభించే సువర్ణావకాశాన్ని కొట్టేశాడు. ఇదిలావుండగా.. టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పడంతో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పగ్గాలు చేపట్టారు. నాలుగో టెస్ట్‌కు దిగిన ఇరు జట్లలోని ఆటగాళ్ల వివరాలు.
భారత జట్టు.. వీరేంద్ర సెహ్వాగ్, విజయ్, ద్రావిడ్, టెండూల్కర్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా.
ఆస్ట్రేలియా.. కటిచ్, హైడెన్, పాంటింగ్, హుస్సే క్లార్క్, వాట్సన్, హ్యాడ్డిన్, వైట్, బ్రెట్ లీ, జాన్సన్, రెజా.