Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్సర్‌ను జయించి, బంతిని దంచి కొట్టిన యువరాజసం

గోడకు కొట్టిన ప్రతిసారీ అంతే బలంగా వెనుదిరిగి రావడం అతనికి తెలిసినంత బాగా బహుశా సమకాలీన ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ తెలిదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక క్రికెట్‌లో ఆటను జయించడమే కాదు. ప్రాణాంతకమైన కేన్సర్‌ను కూడా జయించి మరీ మళ్లీ బరిలోకి దిగి తనను తాను ని

Advertiesment
కేన్సర్‌ను జయించి, బంతిని దంచి కొట్టిన యువరాజసం
హైదరాబాద్ , బుధవారం, 14 జూన్ 2017 (03:52 IST)
గోడకు కొట్టిన ప్రతిసారీ అంతే బలంగా వెనుదిరిగి రావడం అతనికి తెలిసినంత బాగా బహుశా సమకాలీన ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ తెలిదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక క్రికెట్‌లో ఆటను జయించడమే కాదు. ప్రాణాంతకమైన కేన్సర్‌ను కూడా జయించి మరీ మళ్లీ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకుని సమస్త క్రీడాకారులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ధీరోదాత్తుడతడు.  

కేవలం తన శ్రమ, పట్టుదల, పోరాటతత్వంతో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. అతడే యువీ అనే యువరాజ్ సింగ్. 17 ఏళ్ల క్రితం క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు తొలి ఇన్నింగ్స్‌లోనే ఆస్ట్రేలియా పని పట్టిన ఈ నవ యువకుడు తర్వాత ప్రపంచ క్రికెట్ క్రీడా యవనికలో అధిరోహించని శిఖరం లేదు. ఛేదించని రికార్డులు లేవు.
 
యువరాజ్‌ వన్డే కెరీర్‌లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఎన్నో మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు ఫుల్‌ వినోదాన్ని పంచాయి. కానీ ‘ఈ విజయం నాది’ అని అతను గర్వంగా చెప్పుకోగలిగే ప్రదర్శన మాత్రం 2011 వన్డే వరల్డ్‌ కప్‌లోనే. 28 ఏళ్ల తర్వాత భారత్‌ మళ్లీ ప్రపంచకప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర యువీదే. నాలుగు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’... ఇలా అన్నింటా యువీనే కనిపించాడు. బ్యాటింగ్‌లో 362 పరుగులు, బౌలింగ్‌లో 15 వికెట్లతో అతను దుమ్మురేపాడు.  
 
ప్రపంచకప్‌లో భారత్‌ విజయాల బాటలో ఉన్న సమయంలోనే తనకు క్యాన్సర్‌ వచ్చిందనే సంగతి యువరాజ్‌కు తెలుసు. కానీ తాను చనిపోయినా సరే, టోర్నీ మధ్యలో మాత్రం వెళ్లిపోనని అతను గట్టిగా చెప్పుకున్నాడు. చెన్నైలో వెస్టిండీస్‌తో సెంచరీ చేసిన మ్యాచ్‌లో రెండు, మూడు సార్లు అతను గ్రౌండ్‌లోనే వాంతి చేసుకున్నాడు. అయితే రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత చికిత్స అనంతరం క్యాన్సర్‌ నుంచి కోలుకొని మళ్లీ క్రికెట్‌ ఆడాలని భావించడమే పెద్ద సాహసం. కానీ అన్ని అవరోధాలను అధిగమించి యువీ భారత జట్టులోకి పునరాగమనం చేయడం పెద్ద విశేషం.
 
భారత అత్యుత్తమ వన్డే ఆటగాళ్లలో ఒకడైన యువరాజ్‌ గురువారం చాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోనుండటం విశేషం.     
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్కతో అదలా పంచుకుంటుంటే కన్నీళ్లొచ్చాయ్... మర్చిపోలేను... విరాట్ కోహ్లి