Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చిందనుకో.. వెళ్లాల్సిందే కదా: ఆసీస్ ఓపెనర్ బాధ

ఆటగాళ్లు ఔటయితే దిగాలుగా వెవిలియన్ వైపుకు దారి తీయడం సహజంగానే అందరికీ తెలిసిన విషయమే కానీ.. తొలి టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న పుణెలో మాత్రం అరుదైన సన్నివేశం తిలకించాల్సి వచ్చింది.

టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చిందనుకో.. వెళ్లాల్సిందే కదా: ఆసీస్ ఓపెనర్ బాధ
హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (07:33 IST)
భారత్-ఆసీస్ జట్ల మధ్య టెస్ట్ క్రికెట్ సీరీస్ తొలి మ్యాచ్‌లో రెండో ఓవర్ నుంచే అశ్విన్ స్పిన్ బౌలింగ్‌‌తో ఆసీస్ బ్యాట్స్‌మన్ నిజంగానే వణికిపోయారు. బంతి ఎటుతిరిగి ఎటు వెళుతుందో అర్థం కాని క్షణాల్లోనే ఆసీస్ వికెట్లు చూస్తుండగానే టపటపా రాలిపోయాయి. ఆటగాళ్లు ఔటయితే దిగాలుగా వెవిలియన్ వైపుకు దారి తీయడం సహజంగానే అందరికీ తెలిసిన విషయమే కానీ.. తొలి టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న పుణెలో మాత్రం అరుదైన సన్నివేశం తిలకించాల్సి వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ తొలి రోజు 27 ఓవర్లు ముగిశాయి. 28వ ఓవర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వార్నర్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్ రెన్ షా ‘రిటైర్ట్ ఇల్’ ఇబ్బందికరంగా పెవిలియన్‌వైపు వడివడిగా నడిచాడు. మ్యాచ్ ముగిశాక అతనే అసలు విషయం చెప్పాడు. 
 
వార్నర్ ఔటవ్వడానికి ముందే రెన్ షాకు కడుపులో గడబిడగా ఉందట. లంచ్ బ్రేక్‌కు ఎంత టైముందని అడగ్గా, ఓ అరగంట పడుతుందని అంపైర్ చెప్పాడట. కడుపులో ఒత్తిడి బాధను కాసేపు భరించాడు కానీ ఇక ఆపుకోలేకపోయాడు. బ్యాటింగ్ తర్వాతైనా చేస్తాను కానీ ముందు చేయాల్సిన పని ఇంకొకటి ఉందని వేగంగా వెళ్లిపోయాడు. టాయ్‌లెట్‌కు వెళ్లివచ్చాక హమయ్య అనుకుంటూ బయటకొచ్చాడు. మూడో వికెట్ పడ్డాక మళ్లీ వచ్చిన రెన్‌షా హాఫ్ సెంచరీ చేశాడు. 
 
అర్థాంతరంగా రిటైర్డ్ హర్ట్ రూపంలో వెళ్లవలసి వచ్చినందుకు కారణం చెప్పగానే అందరూ నవ్వుకున్నారు. టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చిందనుకో.. వెళ్లాల్సిందే కదా అన్నాడు రెన్ షా. (when you have to go to the toilet, you have to go to the toilet) నిజమే కదా.. టాయ్‌లెట్ బాధ సామన్యుడికైనా, క్రికెటర్‌కైనా ఒకటే మరి..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాచ్ పట్టడంలో కొత్త నిర్వచనం.. వృద్ధి మాన్ సాహా