Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ జట్టు మళ్లీ నిరూపించుకుంది.. విజయానికి వారు అర్హులే.. కోహ్లీ ప్రశంసలు

ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయానికి పూర్తి అర్హురాలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఓవల్ మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని సాధించిన పాకిస్తాన్‌ను అభినంద

Advertiesment
పాక్ జట్టు మళ్లీ నిరూపించుకుంది.. విజయానికి వారు అర్హులే.. కోహ్లీ ప్రశంసలు
హైదరాబాద్ , ఆదివారం, 18 జూన్ 2017 (22:21 IST)
ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టి ఐసీసీ చాంపియన్స్  ట్రోఫీని గెల్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయానికి పూర్తి అర్హురాలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఓవల్ మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని సాధించిన పాకిస్తాన్‌ను అభినందిస్తున్నాను. టోర్నమెంట్ పొడవునా వారు అద్భుత ప్రదర్శన చేశారు. అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో వారెంత అద్బుత ప్రతిభను ప్రదర్శించారో మాటలకందదు. తమదైన రోజున వారు ఎవరికైనా ఆశాభంగం కలిగించగలమని పాక్ టీమ్ మరోసారి నిరూపించింది. అనూహ్యంగా పరాజయం పొందినప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ వరకు చేరుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. 
 
నిజంగా పాక్ టీమ్‌ని అభినందించాలి. అన్ని విభాగాలో వారు టీమిండియాను అధిగమించారు. క్రీడల్లో ఇలాగే జరుగుతుంటుంది. మనం ఎవరినీ తేలిగ్గా తీసుకోకూడదు. నిజంగానే ఈరోజు పాక్ టీమ్ అత్యద్బుతంగా ఆడింది. బంతితో వికెట్లు తీసుకునే అవకాశాలను మేం పొగొట్టుకున్నాం. చక్కటి ప్రదర్శనకోసం ప్రయత్నించాం.కానీ బంతితో కూడా పాకిస్తాన్ బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. వారి దూకుడు ముందు మేం తేలిపోయాం. హార్దిక్ పాండ్యా మాత్రమే మినహాయింపు. అననుకూల పరిస్థితుల్లో కూడా అతడు చూపించిన దూకుడు పరమాద్బుతం. ఓడిపోయాం నిజమే కానీ క్రికెట్‌లో 
ఒక గేమ్ మాత్రమే కోల్పోయాం.  మా తప్పిదాలనుంచి నేర్చుకోవడం ద్వారానే ముందుకు పోవాలి. పిచ్ ఆద్యంతం నిలకడగానే ఉండింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్: అంచనాలు అందుకోలేకపోయిన టీమిండియా