Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువీని అందుకే జట్టులోకి తెచ్చాం : వెటరన్లపై కోహ్లీ ప్రశంసల వర్షం

వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను తిరిగి టీమిండియాలోకి ఇందుకే తీసుకువచ్చామన్నాడు టీమండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి మళ్లీ సంక్షోభంలో పడ్డ ఇండియా వన్డే టీమ్‌ నిలబడి మరీ రెండో వన్డేలో గెలిచిందంటే యువీ, ధోనీలే కారణమని కోహ

యువీని అందుకే జట్టులోకి తెచ్చాం : వెటరన్లపై కోహ్లీ ప్రశంసల వర్షం
హైదారాబాద్ , శుక్రవారం, 20 జనవరి 2017 (03:16 IST)
వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను తిరిగి టీమిండియాలోకి ఇందుకే తీసుకువచ్చామన్నాడు టీమండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 25 పరుగులకే 3 వికెట్లు  కోల్పోయి మళ్లీ సంక్షోభంలో పడ్డ ఇండియా వన్డే టీమ్‌ నిలబడి మరీ రెండో వన్డేలో గెలిచిందంటే యువీ, ధోనీలే కారణమని కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. కటక్‌లో బారామతి స్టేడియంలో గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారాన్ని మోసి అద్వితీయ విజయం సాధించడంలో ఇద్దరు వెటరన్లదే కీలకపాత్ర.
 
కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, కోహ్లి తొలి అయిదు ఓవర్లలోనే పెవిలియన్ బాట పట్టిన స్థితిలో యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనీలు నాలుగో వికెట్‌కు 256 పరుగులు చేయడంతో ఇండియా తన ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు ఆరు వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని విధించింది. అయిదో ఓవర్ లోపే టీమిండియా రథసారథి కోహ్లీ వెనుదిరగటంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. అలాంటి సమయంలో టీమిండియాను అక్షరాలా ఆదుకున్నది వెటరన్ ఆటగాళ్లే. 
 
రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌పై అద్భుత విజయం తర్వాత, కోహ్లీ మాట్లాడుతూ ప్రారంభంలోనే తాము మంచిగా ఆడి ఉంటే ముగింపు సమయంలో ఆట ఎక్కడ ముగిసేదోనని ఆశ్చర్యంలో మునిగామని చెప్పాడు. ప్రారంభంలో తేలిపోయాం కానీ టీమ్‌లోని ఇద్దరు దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఈ దేశానికి వారు ఎన్నోసార్లు చేసిన విధంగానే ఈ మ్యాచ్‌లోనూ తమ శక్తిని చూపించారన్నాడు. 
 
వన్డే జట్టులోకి యువరాజ్ తిరిగి ఎంపిక కావడం చాలా మందికి ఆశ్చర్యం తెప్పించింది. కానీ ఇటీవలి రంజీ ట్రోఫీలో వామప్ గేమ్‌లో ఇంగ్లండ్ టీమ్‌పై యువరాజ్ చేసిన అర్థ సెంచరీ విమర్శకుల నోళ్లు మూయించింది.  
 
గురువారం కటక్ రెండో వన్డేలో యువరాజ్ తనకే సాధ్యమైన ప్రత్యేక డ్రైవ్‌లు, భారీ హిట్లతో చెలరేగిపోవడం మళ్లీ తనలోని పాత యువరాజ్‌ను చూపించింది. యువరాజ్‌ను  అందుకే మళ్లీ టీమ్ లోకి రప్పించాం. ప్రారంభంలో ఓవర్‌కి నాలుగు రన్ల చొప్పున సాగిన స్కోరు చివరికి వచ్చేసరికి 381 పరుగులు సాధించిందంటే యువీ, ధోనీల బ్యాటింగే కారణమన్నాడు. 
 
మైదానంలోని పరిస్థితులను బట్టి చూస్తే 340 పరుగులు చేస్తే చాలనుకున్నాను కాని 381 పరుగులు స్కోరు బోర్డులో చూడగానే ఇంగ్లండ్‌ జట్టుకు అది అసాధ్యమైన లక్ష్యం అని భావించినట్లు కోహ్లీ తెలిపాడు. ఛాంపియన్ ట్రోపీ త్వరలో ప్రారంభం కానున్నందున మూడో వన్డే కూడా తమకు కీలకమైందేనన్న కోహ్లీ రెండు వన్డేలలోనూ పేలవంగా ఆడిన ఓపెనర్లు మూడో వన్డేలో పుంజుకోవలసిన అవసరం ఉందన్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశమే హద్దుగా చెలరేగిన యువరాజ్ సింగ్ : చిన్నబోయిన రికార్డులు