Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెంచరీ చేజార్చుకున్న రోహిత్.. యువరాజ్ మెరుపు అర్థ సెంచరీ. 264/2

ఐసీసీ చాంపియన్ షిప్‌ టోర్నీలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ నిలకడగా ఆడుతోంది. 46 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో 66 పరుగులతోనూ, యువరాజ్ సింగ్ 29

సెంచరీ చేజార్చుకున్న రోహిత్.. యువరాజ్ మెరుపు అర్థ సెంచరీ. 264/2
హైదరాబాద్ , ఆదివారం, 4 జూన్ 2017 (19:39 IST)
వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ఆటను పునరుద్ధరించాక భారత్ జట్టుకు షాక్ తగిలింది. లేని పరుగుకోసం విరాట్ కోహ్లీ దూకుడు ప్రదర్శించడంతో రోహిత్ బలైపోయాడు. వర్షం కారణంగా ఆగిని ఆటను మళ్లీ పునరుద్ధరించాక స్కోర్ పెంచే క్రమంలో దూకుడుగా ఆడిన రోహిత్ 36వ ఓవర్లో షోయబ్ ఖాన్ బంతిని బలంగా బాదిన విరాట్ కోహ్లీ, వెంటనే పరుగుకోసం పిలుపిచ్చాడు. కానీ బ్యాక్ వర్డ్ పాయింట్లో ఉన్న పాక్ ఫీల్డర్ బాబజ్ బంతిని అందుకుని మెరుపులాగా వికెట్ కీపర్ సర్ప్రాజ్ వైపు విసిరాడు. దురదృష్టవశాత్తూ రోహిత్ క్రీజులో బ్యాట్ పెట్టినప్పటికీ సర్ప్రాజ్ వికెట్లను గిరాటేసినప్పటికీ బ్యాట్ గాలిలోనే ఉండటంతో ధర్డ్ అంపైర్ ఔట్ ప్రకటించాడు.
 
ఐసీసీ చాంపియన్ షిప్‌ టోర్నీలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ నిలకడగా ఆడుతోంది. 46 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో 66 పరుగులతోనూ, యువరాజ్ సింగ్ 29 బంతుల్లో 52 పరుగులు చేయడంతో టీమిండియా రెండు వికెట్లకు 283 పరుగులు సాధించింది. రోహిత్ ఔటయినప్పటికీ యువరాజ్ మెరుపు బ్యాటింగ్‌తో స్కోర్ పెరిగింది.
 
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్‌- పాక్‌ పోరు తిరిగి ప్రారంభమైంది. 34వ ఓవర్‌ తొలి బంతి తర్వాత వరుణుడు దర్శనమివ్వడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంతకీ ధోనీని కోహ్లీ పొగిడాడా... తేలిగ్గా మాట్లాడాడా?