Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష్యం పెరిగిన పాకిస్తాన్.. మళ్లీ వర్షంతో ఆగిన మ్యాచ్.. పాక్ 22/0

ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో టీమిండియా విధించి 324 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ క్రికెట్ జట్టు ఆచితూచి అడుతున్న కారణంగా రన్ రేట్ మందగించిపోయిది. వికెట్‌ను కాపాడుకునే ఉద్దేశం ప్రదర్శించిన పాక్

లక్ష్యం పెరిగిన పాకిస్తాన్.. మళ్లీ వర్షంతో ఆగిన మ్యాచ్.. పాక్ 22/0
హైదరాబాద్ , ఆదివారం, 4 జూన్ 2017 (21:12 IST)
ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో టీమిండియా విధించి 324 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ క్రికెట్ జట్టు ఆచితూచి అడుతున్న కారణంగా రన్ రేట్ మందగించిపోయిది. వికెట్‌ను కాపాడుకునే ఉద్దేశం ప్రదర్శించిన పాక్ 4.5 ఓవర్లకు కేవలం 22 పరుగులు మాత్రమే చేసి నత్తనడకను తలపించారు. భారత బౌలర్లు ఉమేష్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం పాక్‌కు కష్టమైపోయింది. మైదానంలో బారీ వర్షం కురవడంతో ఆటను మళ్లీ కుదించడ తప్పదని తేలుతోంది. లక్ష్యాన్ని 30 ఓవర్లకు కుదించినట్లయితే విజయం కోసం పాక్ 229 పరుగులు చేయవలసి ఉంటుంది.
 
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కు టీమిండియా నిర్దేశించిన విజయలక్ష్యం 320. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48 ఓవర్లలో(కుదించిన ఓవర్ల ప్రకారం) మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. అయితే అవే ఓవర్లకు ఇక్కడ పాకిస్తాన్ లక్ష్యం పెరిగింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 324 పరుగులు చేయాల్సి ఉంది.  దాంతో మూలుగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైంది పాక్ పరిస్థితి.  భారత్ విసిరిన భారీ లక్ష్యానికే తొలుత ఉలిక్కిపడిన పాకిస్తాన్‌కు అదనంగా మరో నాలుగు పరుగులు చేరడం ఆ జట్టుకు మరింత భారంగా మారింది.
 
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఇరగదీసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(91;119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లి(81 నాటౌట్;68 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
 
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 320 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ(91;119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లి(81 నాటౌట్;68 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు),  యువరాజ్ సింగ్ (53; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్)  మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ కు రెండుసార్లు వరుణుడు ఆటంకం కల్గించడంతో మ్యాచ్ ను 48.0 ఓవర్లకు కుదించారు.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ బౌలర్లను ఊచకోత కోసిన యువీ. కోహ్లీ, పాండ్యా.. పాక్‌కు 324 పరుగుల లక్ష్యం