ఆస్ట్రేలియాకు రా అశ్విన్.. నీ పెతాపమూ నా పెతాపమూ చూసుకుందాం: స్టార్క్ బెదిరింపు
భారత్, ఆస్ట్రేలియా జట్లమధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్టు క్రికెట్‌లో ఆట కంటే ఆవేశ కావేషాలకే ప్రాదాన్యం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్లకు, బౌలర్లకు మధ్య చిన్న చిన్న గొడవలు ఇరుదేశాల మధ్య క్రీడా సంబంధాలను ప్రతీకారం వైపు మళ్లిస్తున్నాయా అని
భారత్, ఆస్ట్రేలియా జట్లమధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్టు క్రికెట్‌లో ఆట కంటే ఆవేశ కావేషాలకే ప్రాదాన్యం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. ఐపీఎల్ వివిధ దేశాల క్రికెటర్లను ఒక చోటకు చేర్చి ఖండాంతర సంబంధాలను క్రికెటర్ల మధ్య నెలకొల్పుతున్న దేశంలోనే ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న గొడవలు గతంలో ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య తీవ్ర ఘర్షణలను మించిపోతున్నట్లు క్రికెట్ అబిమానులు భీతిల్లుతున్నారు. బ్యాట్స్‌మెన్లకు, బౌలర్లకు మధ్య చిన్న చిన్న గొడవలు ఇరుదేశాల మధ్య క్రీడా సంబంధాలను ప్రతీకారం వైపు మళ్లిస్తున్నాయా అనిపిస్తోంది.
ఇరుదేశాల టీమ్ కెప్టెన్లు కోహ్లీ, స్మిత్‌ల మధ్య మొదలైన చిరు తగవు చివరకు ఆయా దేశాల బోర్డు యాజమాన్యాలు జోక్యం చేసుకునేంత వరకు పోయింది. ఇప్పుడు ఆసీస్ బౌలర్ మిషెల్ స్టార్క్ భారత స్పిన్నర్ అశ్విన్‌ను మా దేశానికి రా చూసుకుందా నీ ప్రెతాపమూ నా పెతాపమూ అనేంత రేంజ్‌లో చెలరేగిపోయాడు,.
గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమించక ముందు బెంగళూరు టెస్టులో తనను అవుట్ చేసిన తర్వాత నుదుటిపై వేలు పెట్టి అశ్విన్ చేసిన సంజ్ఞ స్టార్క్ ఆగ్రహానికి కారణం. ఆసీస్ గడ్డపై భారత స్పిన్నర్ అశ్విన్‌కు బౌలింగ్ చేసి అతని నుదుటిపై బంతిని సంధించాలని తాను కోరుకుంటున్నట్లు స్టార్క్ చెప్పాడు. అదే టెస్టులో స్టార్క్ బౌలింగ్‌లో ముకుంద్ బ్యాట్‌కు తగిలిన బంతి అనూహ్యంగా సిక్సర్‌గా మారగా... తలరాత అన్నట్లుగా స్టార్క్ అదే తరహాలో సైగ చేశాడు. సిరీస్‌లో మాటల యుద్ధానికి భారత జట్టే కారణమని కూడా స్టార్క్ ఆరోపించాడు.
ఏతావాతా చూస్తుంటే ఈసారి భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు టీమిండియాకు ఆసీస్ జట్టు చుక్కలు చూపించడం ఖాయమనిపిస్తోంది. ఇరు జట్లూ మైదానంలోనే ఘర్షణకు దిగకుండా బోర్డు యాజమాన్యాలు గట్టి చర్యలు తీసుకోవడం మంచిదమో.