Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతి ఫైనల్లోనూ చెత్తరికార్డే.. అయినా కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందే వస్తే ఎవరికి లాభం?

‘ఫైనల్లో పాకిస్థాన్‌తో 280పైన ఛేదించాల్సి వస్తే కేదార్‌, పాండ్య ఇద్దరిలో ఒకరు యువీ, ధోని కన్నా ముందుగా బ్యాటింగ్‌కు రావాలి. వాళ్లు వేగంగా ఆడితే ఒత్తిడి తగ్గిపోతుంది. ఫైనల్లో పాక్‌ గట్టిపోటీ ఇస్తుందని

Advertiesment
Kohli
హైదరాబాద్ , సోమవారం, 19 జూన్ 2017 (01:20 IST)
‘ఫైనల్లో పాకిస్థాన్‌తో 280పైన ఛేదించాల్సి వస్తే కేదార్‌, పాండ్య ఇద్దరిలో ఒకరు యువీ, ధోని కన్నా ముందుగా బ్యాటింగ్‌కు రావాలి. వాళ్లు వేగంగా ఆడితే ఒత్తిడి తగ్గిపోతుంది. ఫైనల్లో పాక్‌ గట్టిపోటీ ఇస్తుందని ఆశిస్తున్నా అంటూ టీమిండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ జరగడానికి ముందే మీడియాతో ముచ్చటించాడు. అయితే యువీ ధోనీ కంటే పలానావారు ముందుగా రావాలని మంచి సలహాయే చెప్పిన రాహుల్ అంతకన్నా కీలకమైన విషయం మరొకటి మర్చిపోయాడు. కోహ్లీని ఏస్థానంలో పంపితే మంచిదనే విషయం ద్రావిడ్ సూచించలేకపోయాడు. ఎందుకంటే ఏ టోర్నీ ఫైనల్‌లో అయినా కోహ్లీకి అంత చెత్త రికార్డు ఉంది మరి.
 
ప్రస్తుత భారత జట్టులో డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను కోహ్లి అందిస్తూ వచ్చాడు. జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కోహ్లిపై ఒక మచ్చ ఉంది. అదే కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోవడం. విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్‌ మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లోనూ కోహ్లి బ్యాటింగ్‌ సగటు 22 మాత్రమే.
 
అత్యంత కీలకమైన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి.. లైఫ్‌ దొరికినా.. దానిని కోహ్లి సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాడు. ఫైనల్‌లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తాము ఆశించలేమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
 
పైగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంలో టీమిండియాలో మిడిలార్డర్, టెయిలెండర్స్‌కి అవకాశమే లేకుండా టాపార్డరే పరుగులు దున్నేసింది. దీంతో కీలకసమయంలో మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఫైనల్లో భారత్ పరాజయానికి ఇదీ ఒక కారణమైంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందే చెప్పి మరీ కోహ్లీ పనిపట్టిన అమీర్.. టీమిండియా మైండ్ గేమ్‌తోనే కుప్పగూలిందా?