Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ వారసుడొచ్చాడు. ఊపిరి పీల్చుకుంటున్న టీమిండియా

సొంత మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో అర్ధసెంచరీ సాధించిన మూడు ఇన్నింగ్స్‌లు కూడా చూస్తే అతను చేసిన పరుగులే కాదు, సందర్భం, ఆడిన షాట్లు కూడా వాటి విలువను పెంచుతాయి. ఈ విషయంలో పేరులోనే క

Advertiesment
Second Test
హైదరాబాద్ , మంగళవారం, 14 మార్చి 2017 (03:43 IST)
సొంత మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో అర్ధసెంచరీ సాధించిన మూడు ఇన్నింగ్స్‌లు కూడా చూస్తే అతను చేసిన పరుగులే కాదు, సందర్భం, ఆడిన షాట్లు కూడా వాటి విలువను పెంచుతాయి. ఈ విషయంలో పేరులోనే కాదు తన మార్గదర్శి కూడా అయిన దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను అతను గుర్తుకు తెచ్చాడు. మున్ముందు కూడా భారత టెస్టు జట్టు విజయాల్లో ఓపెనర్‌గా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న రాహుల్, అందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
 
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో లోకేశ్‌ రాహుల్‌ తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌లాంటి టెక్నిక్‌తో దేశవాళీలో అద్భుత ప్రదర్శనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అతనిపై అందరి దృష్టీ ఉంది. కానీ అనూహ్యంగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెత్త షాట్‌లు ఆడి తన వికెట్‌ను పారేసుకున్నాడు. బంగారు అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడని అంతా విమర్శించారు. ఈ మ్యాచ్‌ తర్వాత రాహుల్‌ చిన్ననాటి కోచ్‌ శామ్యూల్‌ జైరాజ్‌కు తన మిత్రుడు ఒకరినుంచి ‘నీ కుర్రాడిని వెళ్లి ఐపీఎల్‌ ఆడుకోమని చెప్పు’ అని వ్యంగ్యంగా ఒక మెసేజ్‌ వచ్చింది.
 
అయితే చిన్నప్పటినుంచి రాహుల్‌ గురించి తెలిసిన కోచ్, తన కుర్రాడిపై నమ్మకముంచాడు. అడిలైడ్‌లో జరిగిన తర్వాతి టెస్టులోనే ఈ మంగళూరు అబ్బాయి సెంచరీ సాధించి తన అసలు సత్తాను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌ తర్వాత మూడు ఫార్మాట్‌లలో కూడా నిలకడగా రాణిస్తూ వచ్చిన లోకేశ్, ఇప్పుడు ఓపెనర్‌గా భారత టెస్టుకు గొప్ప ఆరంభాలు ఇవ్వడంలో బిజీ అయిపోయాడు. టెక్నిక్‌పరంగా, కష్టాల్లో ఉన్నప్పుడు నైతికంగా కూడా రాహుల్‌ ద్రవిడ్‌ ఇచ్చిన మద్దతు అతని ఎదుగుదలలో కీలకంగా మారితే... విమర్శలు వచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ అండగా నిలిచి అవకాశాలిచ్చిన మరో కర్ణాటక దిగ్గజం, భారత కోచ్‌ అనిల్‌ కుంబ్లే పోషించిన పాత్ర కూడా చాలా ఉంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంత జాగ్రత్తగా కాచుకున్నా అశ్విన్ దెబ్బ కొడుతున్నాడే... గింజుకుంటున్న వార్నర్