Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ ఆటగాళ్లలో వణుకుకు అతడే కారణమా?

దాదాపు 12 సంవత్సరాల తర్వాత భారత్‌‍లో ఆస్ట్లేలియా ఒకే ఒక్క టెస్టుమ్యాచ్‌ను భారీ తేడాతో గెలిచి ఉండవచ్చు గాక. ఒక టెస్టులో ఏమరుపాటు కారణంగా ఓటమి పాలైనంత మాత్రాన టీమ్ ఇండియాను మరీ అంత చీప్‌గా అంచనా వేయవచ్చా.. ఏ ఇతర జట్టూ అలాంటి సాహసానికి పూనుకోలేదు కానీ త

భారత్ ఆటగాళ్లలో వణుకుకు అతడే కారణమా?
హైదరాబాద్ , శుక్రవారం, 3 మార్చి 2017 (01:56 IST)
దాదాపు 12 సంవత్సరాల తర్వాత భారత్‌‍లో ఆస్ట్లేలియా ఒకే ఒక్క టెస్టుమ్యాచ్‌ను భారీ తేడాతో గెలిచి ఉండవచ్చు గాక. ఒక టెస్టులో ఏమరుపాటు కారణంగా ఓటమి పాలైనంత మాత్రాన టీమ్ ఇండియాను మరీ అంత చీప్‌గా అంచనా వేయవచ్చా.. ఏ ఇతర జట్టూ అలాంటి సాహసానికి పూనుకోలేదు కానీ తొలి టెస్టుగెలిచిన విజయోత్సాహంతో ఆసీస్ జట్టు ఆటగాళ్లు రోజుకొక్క సవాలుతో ముందుకువస్తున్నారు. మాక్స్‌వెల్ కనుక జట్టులో ఉంటే మిగతా టెస్టు్ల్లోనూ భారత్  పని పడతాడని ఒకరు.. అప్పుడే ఏముంది ముసళ్ల పండగ ముందుంది అంటూ మరొకరు టీమిండియాపై మైండ్ గేమ్ ఆడటంలో ఆసీస్ ఆటగాళ్లు తలమునకలై ఉన్నారు. ఇప్పుడు మిషెల్ మార్ష్ వంతు వచ్చినట్లుంది. తిరుగులేదనుకున్న భారత్ ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను ఆసీస్ బౌలర్ స్టార్క్ పెంచాడని మార్ష్ ప్రకటించేశాడు. 
 
భారత గడ్డపై స్టార్క్‌లాంటి పేస్‌ బౌలర్‌ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్ అభిప్రాయ పడ్డాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను స్టార్క్‌ పెంచాడని అతను అన్నాడు. ‘స్టార్క్‌ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్‌ మా ప్రధాన ఆయుధం. భారత బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటు హాజల్‌వుడ్‌ రివర్స్‌ స్వింగ్‌ కలిస్తే మాకు తిరుగుండదు’ అని మార్ష్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
 
గురువారం భారత జట్టుకు ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావడంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తి స్థాయిలో సాధన చేసింది. ప్ర్రత్యర్థి జట్టు ఘన విజయం సాధించి కూడా పూర్తి స్థాయిలో సాధన చేస్తే భారత జట్టుకు ఆప్షనల్ ప్రాక్టీసు అవకాశం ఇస్తున్నారో అర్థం కావటం లేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్ #PSL2017కి హైదరాబాద్‌లో పిచ్చ క్రేజ్... ఎందుకో?