Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్కంఠ భరిత పోరులో ఇంగ్లండ్‌ను ఊదిపడేసిన భారత్

ఆ దూకుడుకు నరాలు తెగే ఉత్కంఠ అనే పదం కూడా సరిపోదు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండో వన్డేలో కూడా టీమిండియా విరగదీసింది. తనతో ఇకెప్పుడూ పెట్టుకోవద్దన్నంతగా బ్యాటింగ్ బలం తమకే సొంతమన్నంత ధీమాగా ఉతికి పడేసిన భారత్ ఇంగ్లండ్‌ జట్టును 15 పరుగులతో ఓడించింది.

ఉత్కంఠ భరిత పోరులో ఇంగ్లండ్‌ను ఊదిపడేసిన భారత్
హైదరాబాద్ , శుక్రవారం, 20 జనవరి 2017 (02:09 IST)
ఆ దూకుడుకు నరాలు తెగే ఉత్కంఠ అనే పదం కూడా సరిపోదు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండో వన్డేలో కూడా టీమిండియా విరగదీసింది. తనతో ఇకెప్పుడూ పెట్టుకోవద్దన్నంతగా బ్యాటింగ్ బలం తమకే సొంతమన్నంత ధీమాగా ఉతికి పడేసిన భారత్ ఇంగ్లండ్‌ జట్టును 15 పరుగులతో ఓడించింది. ఇంగ్లండ్‌కు విజయం తప్పదనిపించిన క్షణాల్లోనూ ధీమా కోల్పోని కోహ్లీ సేన మూడు వన్డేల సీరీస్‌లో 2-0తో గెలిచి సీరీస్‌ విజేతగా నిలిచింది. 
 
కటక్‌లో బారాబతి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరుగుల శివతాండవమెత్తింది. టాస్ ఓడి బ్యాంటింగ్‌కి దిగిన టీమిండియా తొలివన్డే మాదిరిగానే 25 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, దోనీ విజృంభణతో  ఇంగ్లండ్‌కు 382 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి తమ బ్యాటింగ్ బలాన్ని మరోసారి చూపించింది. భారత్ భారీ స్కోరులో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనిలు ప్రధాన పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్(150;127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, మహేంద్ర సింగ్ ధోని(134;122 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తనదైన మార్కును చూపెట్టాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 256 పరుగుల జోడించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్‌పై నాల్గో వికెట్‌కు ఓవరాల్గా ఇదే అత్యధిక స్కోరు.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్(5), కోహ్లి(8),శిఖర్ ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో యువరాజ్-ధోనిలు భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఒకవైపు బాధ్యత, మరొకవైపు ఫుల్ జోష్తో ఈ జోడి చెలరేగిపోయింది. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 56 బంతులను ఎదుర్కొన్న యువీ.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 42 బంతులను తీసుకున్నాడు. అయితే మూడో అర్థ శతకాన్ని మాత్రం యువీ 29 బంతుల్లోనే పూర్తి చేసి నిష్క్రమించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14వ వన్డే సెంచరీ కాగా,  ఐదేళ్ల తరువాత అతనికి ఇదే తొలి సెంచరీ. 2011లో జరిగిన వరల్డ్ కప్లో వెస్టిండీస్ పై యువరాజ్ చివరిసారి వన్డే శతకం సాధించాడు.
 
యువరాజ్ సెంచరీ తరువాత ధోని కూడా సెంచరీ సాధించి తనలోని సత్తా తగ్గలేదని నిరూపించాడు. ప్రత్యేకంగా హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 68 బంతులను ఎదుర్కొన్న ధోని.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 38 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇది ధోని కెరీర్లో 10వ వన్డే సెంచరీ. కాగా, యువీ నాల్గో వికెట్ గా నిష్కమణ తరువాత ధోనికి కేదర్ జాదవ్ జతకలిశాడు. స్కోరును పెంచే యత్నంలో 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసిన జాదవ్ ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా (19 నాటౌట్;9 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్), జడేజా(16 నాటౌట్;8 బంతుల్లో 1ఫోర్ల, 1 సిక్స్) రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కటక్ వన్డే: యువీ-ధోనీల అద్భుత ఇన్నింగ్స్.. యువీ @150 - ధోనీ @ 134