Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకతో మ్యాచ్ ఓడగానే కోహ్లీ అంత పరుషంగా మాట్లాడాడా... మరి కుంబ్లే చేసేదీ అదే కదా?

కీలకమైన మ్యాచ్ ఓడిపోయి జట్టు మొత్తం లయ తప్పుతున్న నేపథ్యంలో జట్టు కేప్టెన్‌గా కఠినంగా వ్యవహరించాను కాబట్టే తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్బుత విజయం సాధంచామని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. మ్యాచ్ గెలిస్తే తప్ప టోర్నీలో కొనసాగే చాన్స

Advertiesment
శ్రీలంకతో మ్యాచ్ ఓడగానే కోహ్లీ అంత పరుషంగా మాట్లాడాడా... మరి కుంబ్లే చేసేదీ అదే కదా?
, మంగళవారం, 13 జూన్ 2017 (06:54 IST)
కీలకమైన మ్యాచ్ ఓడిపోయి జట్టు మొత్తం లయ తప్పుతున్న నేపథ్యంలో జట్టు కేప్టెన్‌గా కఠినంగా వ్యవహరించాను కాబట్టే తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్బుత విజయం సాధంచామని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.  మ్యాచ్ గెలిస్తే తప్ప టోర్నీలో కొనసాగే చాన్స్ కూడా ఉండదు కాబట్టి జట్టును మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశాననీ, ఈ క్రమంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని కోహ్లీ అంగీకరించాడు. 
 
అసలు విషయం ఏమిటంటే చాంపియన్స్‌ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం భారత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కొత్త తరహా వ్యూహాలతో మళ్లీ సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోహ్లి జట్టును మళ్లీ  దారిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది కాబట్టే దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విజయం దాని ఫలితమేనని అతను చెప్పాడు. 
 
‘మనం ఇలాంటి విషయాల్లో నిజాయితీగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో సహచర ఆటగాళ్లను బాధపెట్టేలా, మనసును నొప్పించే విధంగా కఠినంగా మాట్లాడాల్సి ఉంటుందనేది నా నమ్మకం. లంక ముందు మేం తలవంచిన తర్వాత నాతో సహా ఎవరెవరు ఏం తప్పులు చేశామో మాట్లాడుకున్నాం. ఈ స్థాయిలో ఆడేందుకు కోట్లాది మంది నుంచి మనల్నే ఎందుకు ఎంచుకున్నారో నిరూపించాల్సి ఉందని చెప్పాను’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 
 
దేశానికి ఆడగల, ఓడినా మళ్లీ కోలుకొని చెలరేగగల సత్తా తమకు ఉందని చూపించాల్సిందిగా ఆటగాళ్లను కోరానని... ఒకరిద్దరు కాకుండా సమష్టి ప్రదర్శనతోనే దక్షిణాఫ్రికాతో గెలుపు సాధ్యమైందని అతను చెప్పాడు.
 
జట్టు కెప్టెన్‌గా కోహ్లీ చేసింది నూటికి నూరు శాతం కరెక్టే. చావో రేవో తేల్చుకోవలసి వచ్చినప్పుడు జెంటిల్మన్‌ తరహాలో వ్యవహరించడం ఫలితాలు తీసుకురాదు కాబట్టి ఏ కెప్టెన్ అయినా కఠినంగా వ్యవహరించాల్సిందే.. కానీ  ఇదే సూత్రం మరి టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేకి కూడా వర్తిస్తుంది కదా. జట్టు క్రమం తప్పుతోందనిపించినప్పుడు, ప్రాక్టీస్‌ను అలక్ష్యం చేస్తోందనిపించినప్పుడు కుంబ్లే నోర్మూసుకుని ఊరుకోలేడు కదా.. మరి జట్టు మొత్తంగా కోహ్లీ నాయకత్వంలో ఈ కోచ్ మాకొద్దు అనేంత రెబల్ ఎందుకయ్యారు? ఇనేదే అర్థం కావటం లేదు.
 
కోహ్లీకి వర్తించే రూల్ కోచ్ కుంబ్లేకి వర్తించదా? ఎవరు సమాధానం చెబుతారు మరి?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీని మించిన అత్యుత్తమ ఆటగాడు అతడేనా... ఎవరు?