Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బౌలింగుతో కుమ్మేశారు... బ్యాటింగుతో బాదిపడేశారు. శునకాలు ఎవరో తేలిపోయింది..

ఆటలో స్ఫూర్తికంటే సవాళ్లలో, విసుర్లలో, అవమానకరమైన అభిమానుల నిందా వాఖ్యలతో బలం పెంచుకుని మైదానంలోకి వచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును టీమిండియా ఉతికిఆరేసింది. పెద్ద పులులం. శునకాలను నల్చుకుతింటాం అంటూ మైదానం వెలుపల హేళనలతో కోట్లాది భారతీయలు గుండెల్న

Advertiesment
బౌలింగుతో కుమ్మేశారు... బ్యాటింగుతో బాదిపడేశారు. శునకాలు ఎవరో తేలిపోయింది..
హైదరాబాద్ , శుక్రవారం, 16 జూన్ 2017 (02:12 IST)
ఆటలో స్ఫూర్తికంటే సవాళ్లలో, విసుర్లలో, అవమానకరమైన అభిమానుల నిందా వాఖ్యలతో బలం పెంచుకుని మైదానంలోకి  వచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును టీమిండియా ఉతికిఆరేసింది. పెద్ద పులులం. శునకాలను నల్చుకుతింటాం అంటూ మైదానం వెలుపల హేళనలతో కోట్లాది భారతీయలు గుండెల్ని రగిలించి బంగ్లా జట్టు అభిమానులు మరెన్నడూ తలెత్తుకోకుండా చేసింది టీమిండియా.


తమ అభిమానుల వదురుబోతు వ్యాఖ్యలు బలుపు కాదు వాపు అని నిరూపిస్తూ బంగ్లా జట్టు చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో పోటీ అనే మాట కూడా మర్చిపోయినట్లుగా భారత జట్టు ముందు తేలిపోయింది. ఓడిపోవచ్చు కానీ ఇంత సునాయాసంగా గెలుపును ప్రత్యర్థికి ఇస్తారా అనేంతగా బంగ్లా జట్టు టీమిండియా ముందు సాగిలపడిపోయింది. సందు దొరికితే గేమ్‌ను అమాంతంగా లాగేసుకునే ప్రతిభ ఉన్న బంగ్లా జట్టు తమ గేమ్ ప్లాన్‌లన్నింటినీ టీమిండియా తుత్తునియలు చేస్తూ పోతూ ఉంటే.. ఇక చాలు.  నావల్ల కాదంటూ చప్పగా పక్కకు తప్పుకుంది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టులో ప్రమాదకరంగా మారుతున్న ఇద్దరు కీలకమైన బ్యాట్స్‌మన్‌లను టీమ్ ఇండియా పార్ట్ టైమ్ బౌలర్ కేదార్ జాదవ్ నడ్డి విరవడంతో మొదలైన భారత్ జోరు ఫైనల్‍‌లో అడుగు పెట్టేవరకు ఎక్కడా ఆగలేదు. తమీమ్, ముష్ఫికర్‌ భాగస్వామ్యం బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు అండగా నిలిస్తే... ‘ట్రంప్‌ కార్డ్‌’ కేదార్‌ జాదవ్‌ జాదూతో మళ్లీ కోలుకున్న భారత్, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా కట్టి పడేసింది. ఆ తర్వాత ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి డిఫెండింగ్‌ చాంపియన్‌ సత్తానుప్రదర్శించింది.

రోహిత్‌ శర్మ సెంచరీ, కోహ్లి క్లాసిక్‌తో పాటు శిఖర్‌ ధావన్‌ మెరుపులు వరుసగా రెండోసారి  చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాయి. టీమిండియా తురుపుముక్కలు భువనేశ్వర్ కుమార్, బూమ్రా ఇద్దరూ బంగ్లా బ్యాట్స్‌మన్లకు చుక్కలు చూపించగా పార్ట్ టైమ్ బౌలర్ పాత్రలో వచ్చిన కేదార్ జాదవ్ రెండే రెండు ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టి బంగ్లా పని పట్టాడు. కేదార్ల మ్యాచ్‌ను ఎంతగా మలుపుతిప్పాడంటే కోహ్లీ ఆనందం తట్టుకోలేక జాదవ్‌ను హత్తుకున్నాడు. పకపకా నవ్వి జాదవ్ భుజం తట్టాడు. 
 
గురువారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో టీమిండియా 9 వికెట్ల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తమీమ్‌ ఇక్బాల్‌ 82 బంతుల్లో 70; 7 ఫోర్లతోనూ,  ముష్ఫికర్‌ 85 బంతుల్లో 61; 4 ఫోర్ల తోనూ అర్ధసెంచరీలు చేశారు. జాదవ్, బుమ్రా, భువనేశ్వర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 40.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 265 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ 129 బంతుల్లో 123 నాటౌట్‌‌తో చెలరేగి అజేయ సెంచరీ సాధించగా... కోహ్లి 78 బంతుల్లో 96 నాటౌట్‌తో అండగా నిలిచాడు. శిఖర్‌ ధావన్‌ 34 బంతుల్లో 46; 7 ఫోర్లతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది. పదేళ్ల తర్వాత దాయాదుల మధ్య ఫైనల్ పోరు కానుండటంతో ఆదివారం జరగునున్న తుది మ్యాచ్ హైప్ చుక్కలనంటుతోంది. భారత్, పాక్‌ ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి టైటిల్‌ గెలుచుకోవడం అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని క్షణం. ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో మాత్రం ఇరు జట్ల మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి. అయితే నాటితరం అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే మ్యాచ్‌ 1985లో మెల్‌బోర్న్‌లో జరిగింది. అప్పట్లో 7 ప్రధాన జట్లు పాల్గొని దాదాపు ప్రపంచకప్‌లాగే సాగిన ‘వరల్డ్‌ చాంపియన్‌షిప్‌’ ఫైనల్లో భారత్‌ 8 వికెట్లతో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం... ఆదివారం పాకిస్తాన్‌తో ఫైనల్లో ఢీ