Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 వికెట్ల క్లబ్‌లో హర్భజన్‌కు స్థానం

Advertiesment
300 వికెట్ల క్లబ్‌లో హర్భజన్‌కు స్థానం
, శుక్రవారం, 7 నవంబరు 2008 (16:12 IST)
టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో భారత బౌలర్ హర్భజన్‌ సింగ్ స్థానం సంపాదించాడు. దీంతో భజ్జీ కపిల్, కుంబ్లేల సరసన స్థానాన్ని దక్కించుకున్నట్లైంది. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆసిస్ కెప్టెన్ రికీ పాంటింగ్ వికెట్‌ను పడగొట్టిన భజ్జీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

అంతకు ముందే రన్ అవుట్ రూపంలో హేడన్ పదహారు రన్‌లతో వెనుదిరగగా, 24 పరుగులు చేసిన పాంటింగ్ హర్భజన్ బౌలింగ్ వికెట్ సమర్పించుకుని భజ్జీకి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్లో 441 పరుగులు చేయగా, ప్రతి సవాలుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ రెండు వికెట్ల నష్టానికి, 85 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీ విరామ సమయానికి రికీ పాంటింగ్, కటిచ్‌ల జోడీ ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఆ తరువాత పాంటింగ్ వెనుదిరగగా... మైక్ హస్సీ 3, కటిచ్ 40 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu