Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

200వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్ల జాబితాలో జహీర్ ఖాన్!

Advertiesment
200వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్ల జాబితాలో జహీర్ ఖాన్!
FILE
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డర్బన్ టెస్టులో భారత సూపర్ బౌలర్ జహీర్ ఖాన్ 200 వికెట్లు సాధించాడు. డర్బన్ టెస్టు మూడో రోజు మూడు వికెట్ల సాధించడం ద్వారా జహీర్ ఖాన్.. 1000 పరుగులు 200 వికెట్లు సాధించిన భారత ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదోవాడిగా నిలిచాడు. ఇంతకుముందు కపిల్ దేవ్, శ్రీనాథ్, కుంబ్లే, హర్భజన్‌లు ఈ ఘనత సాధించారు.

మూడో రోజు ఆటలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు క్లిష్ట పరిస్థితుల్లో భాగస్వామ్యం అందించిన జహీర్ ఖాన్ 63 బంతులాడి, నాలుగు ఫోర్లతో 27 పరుగులు సాధించాడు. కానీ హారిజ్ బౌలింగ్‌కు జహీర్ ఖాన్ పెవిలియన్ దారి పట్టాడు.

జహీర్ 200 వికెట్లు సాధించిన ఐదో ఆటగాడిగా సాధించిన రికార్డుతో పాటు.. మరికొద్దిసేపు క్రీజులో నిలకడగా కొనసాగివుంటే వీవీఎస్ లక్ష్మణ్ సెంచరీని మిస్ చేసుకుని వుండడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. చివరి సమయంలో జహీర్ ఖాన్ దూకుడుగా ఆడటంతో లక్ష్మణ్‌కు భాగస్వామ్యం గాడితప్పిందని వారు చెబుతున్నారు.

అలాగే రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ సాధించిన 96 పరుగులు భారత్‌కు ఈ మైదానంలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. ఇంతకుముందు ప్రవీణ్ ఆమ్రే 1992-93లో 103 పరుగులు చేశాడు.

ఆమ్రేకు తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డర్బన్ మైదానంలో 96 పరుగులు సాధించిన రెండో భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంకా రెండో ఇన్నింగ్స్‌ల్లో లక్ష్మణ్ మూడు వేల మైలురాయి చేరుకున్నాడు. 77 ఇన్నింగ్స్‌ల్లో 51.20 సగటుతో మొత్తం 3072 పరుగులు నమోదు చేశాడు. వాటిలో ఐదు సెంచరీలు, 19 అర్థసెంచరీలు కూడా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu