సెహ్వాగ్ అర్థసెంచరీ: భారత్ స్కోరు 104/1
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్ (60) తొమ్మిది ఫోర్లు కొట్టి అర్థసెంచరీ సాధించాడు.మరో ఓపెనర్‌గా మైదానంలోకి కదం తొక్కిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 11 పరుగుల వద్దే బ్రాడ్ బౌలింగ్‌లో అవుటై అభిమానులను నిరాశపరిచాడు.
సచిన్ స్థానంలో బరిలోకి దిగిన గౌతం గంభీర్ (30) ఆరు ఫోర్లు సాధించి, సెహ్వాగ్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు. దీంతో భారత్ 17 ఓవర్ల వద్ద ఓ వికెట్‌ను మాత్రం కోల్పోయి 106 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా... ఆదివారం రెండు గంటలకు ప్రారంభమైన నాలుగో వన్డేకు వరుణ దేవుడు అంతరాయం కలిగించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 14 ఓవర్ల వద్ద ఆడుతుండగానే... వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆటను తిరిగి 5.50 గంటలకు ప్రారంభించారు.