భారత్-ఆసీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజైన శనివారం ఆసీస్... భారత్‌కు ధీటుగానే ఆడుతోంది. ఫిరోజ్ షా కోట్లలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం ఆటను ప్రారంభించిన ఆసీస్ జట్టు 426 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది.
నిన్నటి మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్ మ్యాజిక్‌తో వీరూ వడివడిగా రెండు వికెట్లు తీసి అభిమానుల్లో ఆశలు రేపాడు. అదే ఊపుతో మైదానంలోకి కాలిడిన సెహ్వాగ్ తన బౌలింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వాట్సన్‌ను 36 పరుగుల వద్ద పెవిలియన్ ముఖం పట్టించాడు.
అతని స్థానంలో బరిలోకి దిగిన హడిన్‌ను 17 పరుగుల వద్ద కుంబ్లే బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు.
తాజాగా... క్లార్క్ (81), వైట్ (21)లు నిలకడగా ఆడుతూ... ఆసీస్ జట్టుకు అండగా క్రీజులో కొనసాగుతున్నారు. దీనితో ఆసీస్ ఆరు వికెట్ల పతనానికి 486 పరుగులు చేసింది.