గవాస్కర్ - బోర్డర్ సిరీస్‌లో నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోమారు రాణించి సెంచరీ పూర్తి చేశాడు. అలాగే ఓపెనర్ సెహ్వాగ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్.లక్ష్మణ్‌లు అర్థ శతకాలతో రాణించారు.
దీంతో భారత్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. సచిన్ అవుట్ కావడంతో కెప్టెన్ ధోనీ 4, గంగూలీ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు సచిన్ తన కెరీర్లో 40వ శతాకాన్ని పూర్తి చేసుకున్నాడు.
రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సచిన్.. ఆ తర్వాత విజృంభించి కంగారులపై పదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా బౌలర్లలో క్రేజా మూడు, వాట్సన్. జాన్సన్‌లు ఒక్కో వికెట్ తీసి రాణించారు.